Home /News /life-style /

DIWALI 2019 PUJA MUHURAT DATE AND SIGNIFICANCE HISTORICALLY NK

Diwali 2019 : దీపావళి పూజా విధానం... పురాణ ప్రాసస్థ్యం

దీపావళి పూజా విధానం... పురాణ ప్రాసస్థ్యం

దీపావళి పూజా విధానం... పురాణ ప్రాసస్థ్యం

Diwali 2019 : దీపావళి నాడు ఇళ్లను నీటితో పరిశుభ్రం చేసుకుంటారు. ఆఫీసుల్ని కూడా సరికొత్తగా డెకరేట్ చేసుకుంటారు. ఇళ్లు, ఆఫీసులు, ఇంటి ఆవరణల్లో ప్రమిదలు వెలిగిస్తారు. రంగురంగుల ముగ్గులు వేసి... పూలతో డెకరేట్ చేస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 27న దీపావళిని జరుపుకుంటున్నాం. కొంతమంది అక్టోబర్ 28న కూడా జరుపుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
    Diwali 2019 : దీపావళి, దీపావలి, దివాళీ, దివాలీ... పేరు ఏదైనా... దీపాలను వరుసగా పేర్చి... జరుపుకునే అద్భుతమైన పండుగ దీపావళి. పురాణాల్లో రావణాసురుణ్ని... శ్రీరామచంద్రస్వామి వధించిన సందర్భంగా... ఈ పండుగను జరుపుకుంటారు భారతీయులు. చీకటిని తరిమికొట్టి... సత్యమే జయిస్తుంది అని చెప్పడమే దీపావళి ప్రధాన ఉద్దేశం. ఇక సైంటిఫిక్ కోణంలో చెప్పుకుంటే... వర్షాకాలం వెళ్లి... శీతాకాలం వస్తున్న సమయంలో... పెద్ద సంఖ్యలో దోమలు, ఈగలు, ఇతరత్రా క్రిమి కీటకాలు, సూక్ష్మజీవులు, వైరస్ వంటివి వస్తుంటాయి. వాటి నుంచీ మనకు విముక్తి కలిగించేందుకు పెద్ద సంఖ్యలో బాణసంచా కాల్చుతారు. తద్వారా పొగ వెలువడి... చెడు జీవులు అంతరిస్తాయని పెద్దలు చెబుతుంటారు.

    దీపావళి నాడు ఇళ్లను నీటితో పరిశుభ్రం చేసుకుంటారు. ఆఫీసుల్ని కూడా సరికొత్తగా డెకరేట్ చేసుకుంటారు. ఇళ్లు, ఆఫీసులు, ఇంటి ఆవరణల్లో ప్రమిదలు వెలిగిస్తారు. రంగురంగుల ముగ్గులు వేసి... పూలతో డెకరేట్ చేస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 27న దీపావళిని జరుపుకుంటున్నాం. కొంతమంది అక్టోబర్ 28న కూడా జరుపుకుంటున్నారు.

    ఐదు రోజులు జరిగే ఈ వేడుకలు... అక్టోబర్ 25న దంతేరస్‌తో ప్రారంభమవుతాయి. చిన్న దీపావళిగా పిలిచే... నరక చతుర్దశి... అక్టోబర్ 26న వస్తుంది. ఆ తర్వాత అసలైన దీపావళి 27న జరుగుతుంది. అక్టోబర్ 28న గోవర్ధన పూజ ఉంటుంది. అక్టోబర్ 29న భాయ్ దూజ్‌తో దీపావళి వేడుకలు ముగుస్తాయి.

    దంతేరస్ (అక్టోబర్ 25) : పండగ మొదటి రోజైన దంతేరస్ అంటే... ధనం తెచ్చుకోవడం అని అర్థం. ఆ రోజు చాలా మంది బంగారం కొనుక్కొని ఇళ్లకు తెచ్చుకుంటారు. ఎవరి తాహతుకు తగినట్లు వారు ఎంతో కొంత బంగారాన్ని కొనుక్కుంటారు.

    నరక చతుర్దశి (అక్టోబర్ 26) : ఈ రోజున నరకాసురుణ్ని శ్రీకృష్ణభగవానుడు వధించి... 16 వేల మంది గోపికలను కాపాడినట్లు చెబుతారు. ఆ సందర్భంగా... నరక చతుర్దశి జరుపుకుంటారు.

    దీపావళి (అక్టోబర్ 27) : ప్రధాన పండుగ రోజున లక్ష్మీ దేవికి పూజ చేస్తారు. ఇందుకోసం పూజా సమయాల్ని పాటిస్తారు.

    లక్ష్మీదేవి పూజ - సాయంత్రం 6.43 నుంచీ రాత్రి 8.15 వరకు
    పూజకు పట్టే సమయం - గంటా 32 నిమిషాలు
    ప్రదోష కాలం - సాయంత్రం 5:41 నుంచీ 08:15 వరకు
    వృషభకాలం - సాయంత్రం 6:43 నుంచీ రాత్రి 08:39 వరకు
    అమావాస్య తిథి మొదలు - అక్టోబర్ 27న మధ్యాహ్నం 12:23కి.
    అమావాస్య తిథి ముగింపు - అక్టోబర్ 28న ఉదయం 09:08కి.

    గోవర్ధన పూజ (అక్టోబర్ 28) : దీన్నే అన్నకూట పూజ అని కూడా ఉంటారు. ఇదే రోజున శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని తన వేలితో ఎత్తినట్లు చెబుతారు. స్వర్గలోకాధిపతి ఇంద్రుడు ఆగ్రహంతో వరదలు రప్పించగా... వరద బాధితుల్ని రక్షించేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తాడని చెబుతారు.

    గోవర్ధన పూజ - సాయంత్రం 3.26 నుంచీ సాయంత్రం 5.40 వరకు

    భాయ్ దూజ్ (అక్టోబర్ 29) : దీపావళిలో చివరిదైన ఈ రోజున సోదరులు, అక్కచెల్లెళ్లు అందరూ కలిసిమెలిసి జీవిస్తారు. ఇది దాదాపు రక్షా బంధన్ తరహాలో ఉంటుంది.

    భాయ్ దూజ్ ముహూర్తం - మధ్యాహ్నం 1.11 నుంచీ సాయంత్రం 3.25 వరకు

    వ్యాపారస్థులకు చివరి తేదీ : దీపావళిని వ్యాపారులు ఆర్థిక సంవత్సరంలో చివరి తేదీగా భావిస్తారు. ఇదే రోజున క్షీరసాగరం నుంచీ లక్ష్మీదేవి ఆవిర్భవించినట్లుగా భావిస్తూ, అమ్మవారికి పూజలు చేస్తారు. పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అందరూ సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకుంటారు. అమ్మవారికి పూజ తర్వాత కొత్త పద్దు పుస్తకాల్ని ప్రారంభిస్తారు.

    దసరా తర్వాత 20 రోజులకు దీపావళి జరుగుతుంది. రావణుణ్ని వధించిన తర్వాత 20 రోజులకు సీతా, లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు అయోధ్యకు వస్తారు. ఆ సందర్భంగా దీపావళి జరుపుకుంటారు. మరికొందరు... పాండవులు 12 ఏళ్ల వనవాసం, ఏడాది అజ్ఞాత వాసం పూర్తి చేసుకొని... హస్తినకు వస్తారు. ఆ సందర్భంగా దీపావళి జరుపుకుంటారు. మరికొందరు విష్ణువు, లక్ష్మీదేవిల వివాహం సందర్భంగా దివాళీ జరుపుకుంటారు. రాక్షసులపై కాళికామాత విజయానికి గుర్తుగా ఈశాన్య భారత ప్రజలు దీపావళిని జరుపుకుంటారు. సిక్కులు కూడా దీపావళి జరుపుకుంటారు. గురు హర గోవింద్... గ్వాలియర్ కోటలో బంధించిన వారిని విడుదల చెయ్యడంతో... ఆ సదర్భంగా సిక్కులు పండగ చేసుకుంటారు. జైనులకు ఇదే రోజున మహావీర నిర్వాణం జరగడంతో వాళ్లూ ఈ వేడుక చేసుకుంటారు.

     

    Pics : క్యూట్ సింగర్ షిర్లీ సెషియా అందాలు

    ఇవి కూడా చదవండి :

    Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం

    Diwali 2019 : దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...

    Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి

    Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.

    Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు
    First published:

    Tags: Diwali 2019, Telugu news, Telugu varthalu

    తదుపరి వార్తలు