Diwali 2019 : దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...

దీపావళి పండుగ రోజున నువ్వులనూనెని వాడడం మేలు ఎంతో చేస్తుందని పండితులు విశ్వసిస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: October 26, 2019, 9:09 AM IST
Diwali 2019 : దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...
దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...
  • Share this:
Diwali 2019 : వెలుగుల పండుగ దీపావళి. ఈ సంవత్సరం 27, 28 తేదీల్లో ఈ పండుగను జరుపుకుంటున్నారు. దోపావళి నాడు తమ ఆర్థిక సమస్యలన్నీ తీరి... తమను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ప్రతిఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే... కొన్ని పనులు చేయడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చని పండితులు అంటున్నారు. అవేంటంటే.. దీపావళి పండుగ రోజున ఉదయాన్నే నువ్వుల నూనెను తలకి, శరీరానికి రాసి... కాసేపు మర్దన చెయ్యాలి. ఎలా అంటే ఆ నూనెంతా మన శరీరం గ్రహించాలి. ఆ తర్వాత కుంకుడుకాయ, సున్నిపిండితో అభ్యంగన స్నానం చేసి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే నరకబాధల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

కేవలం ఇది ఆచారమే కాదు.. శాస్త్రపరంగా కూడా మనకి మేలు జరుగుతుందని తేలింది. శరీరాన్ని, జుట్టుని సంరక్షించడంలో నువ్వులనూనె అమోఘంగా పనిచేస్తుంది.. అదేవిధంగా.. కీళ్ళనొప్పులకి మందుగా కూడా నూనెని ఉపయోగించొచ్చు. కాబట్టి.. రెండు విధాలుగా మేలుచేసే ఈ పనిని మీరు కూడా ఆచరించమని సూచిస్తున్నారు పండితులు.

 

Pics : నడుమందాలతో కవ్విస్తున్న పూజ హెగ్డే




ఇవి కూడా చదవండి :

Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండిHealth Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.

Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు

Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు


Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి
First published: October 26, 2019, 9:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading