Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: October 26, 2019, 9:11 AM IST
Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం
భారత సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. దీపాల వెలుగుల్లో తారాజువ్వల మోతలతో సందడిగా మారే ఈ పండుగ అశ్వయుజ మాసంలో వస్తుంది. మొత్తం మూడు రోజుల పాటూ జరుపుకునే పండుగ దీపావళి. ఈ రోజున ఉన్నవారైనా.. లేనివారైనా.. ఉన్నంతలో ఇంటి ముందు దీపాలు వరుసగా పెడుతుంటారు. ఇంటి గుమ్మాల దగ్గర, ప్రహరీ గోడలపై, దేవుళ్ల పటాల దగ్గర, తులసి మొక్క ముందు, ఇలా అనేక చోట్ల దీపాలను వరుసగా పెడతారు. ఈ రోజుల్లో ప్లాస్టిక్ దీపాలు ఉంటున్నా... వాటి బదులు మట్టితో చేసిన ప్రమిదల్లో దూదిని ఉంచి, నూనే పోసి, దీపం వెలిగిస్తే ఎంతో మేలు. ఇందుకు కారణాలేంటో తెలుసుకుందాం.
దీప అంటే దీపం. ఆవళి అంటే వరుస. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపాలను సంపద, ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు. అందువల్లే దీపావళి రోజున దీపాలను వెలిగించి సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని మహిళలు ఎంతో భక్తితో పూజించి ఇంటికి ఆహ్వానిస్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరమై.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం.
అదేవిధంగా... దీపావళి రోజున ఏ ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటాయో... ఆ ఇంట మహాలక్ష్మి కొలువు తీరుతుందని ప్రజల నమ్మకం.. ఈ కారణంగా... దీపావళి పండుగ సాయంత్రం హిందువులు దీపాలు పెడుతుంటారు.
చనిపోయిన వారికి పెద్దల పండుగకి తర్పణాలు ఇస్తుంటారు. ఆ సమయంలో స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పితృదేవతలకు... తిరిగి స్వర్గలోకాలకు వెళ్లే సమయంలో వెలుతురు చూపించడం కోసమే దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని ప్రతీతి.
ఇలాంటి కారణాలు ఉండటంతో... దీపావళిని పిల్లలు, పెద్దలు ఎంతో ఆనందంతో జరుపుకుంటారు.
Pics : కుందనపు బొమ్మ శ్రేయ ఘోషాల్... క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :
Diwali 2019 : దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...
Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి
Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.
Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు
Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు
Published by:
Krishna Kumar N
First published:
October 26, 2019, 9:11 AM IST