Health Tips : సన్‌స్క్రీన్‌లోషన్ ఎక్కువగా రాస్తున్నారా..

Summer Tips | ఎండాకాలం వచ్చిందంటే చాలు సన్‌స్క్రీన్ లోషన్స వాడకం ఎక్కువవుతుంది. చాలామంది SPF గ్రేడ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని వాడుతుంటారు. ఇది ఎంతవరకు మంచిదో ఓ సారి చూద్దాం..

news18-telugu
Updated: June 13, 2019, 11:28 AM IST
Health Tips : సన్‌స్క్రీన్‌లోషన్ ఎక్కువగా రాస్తున్నారా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చక్కని చర్మం ఉండాలని అందరూ అనుకుంటారు. అందుకోసం ఏవేవో క్రీమ్స్ రాస్తుంటారు. ముఖ్యంగా సన్ స్క్రీన్ లోషన్ అన్నింటికంటే ముందు వరుసలో ఉంటుంది. ఇందులోనూ ఏ లోషన్ అయితే మంచిదో ఒకటికి పదిసార్లు ఆలోచించి.. SPF గ్రేడ్ ఎక్కువగా ఉన్నది తీసుకుంటారు. దీని వల్ల సూర్యుడి నుంచి ప్రవహించి అతినీలలోహిత కిరణాల నుంచి తప్పించుకుని చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చని.. ఇది మంచిదే. కానీ.. కొంతవరకే.. ఇందులోనూ కొన్ని చిక్కులున్నాయి.

మాములుగానే SPF 15 గ్రేడ్ సన్‌స్క్రీన్ రాస్తుంటాం.. ఎండాకాలం అయితే.. ఈ గ్రేడ్ కాస్తా పెరుగుతుంది. అయితే అంత మంచిది కాదని చెబుతున్నాయి పరిశోధనలు. ముఖ్యంగా.. ఎండలో వెళ్లిన ప్రతీసారి సన్‌స్క్రీన్ లోషన్ మళ్లీ మళ్లీ రాయడం వల్ల సూర్యుడి నుంచి అందే విటమిన్ డి దూరమవుతుందని తేలింది. దీంతో.. ఊపిరితిత్తుల జబ్బులు, ఎముకలు బలహీనపడిపోవడం, కండరాలు పట్టేయడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా మానవుని శరీరంలో ప్రతీ కణానికి విటమిన్ డీ చాలా అవసరం. కానీ, ఎండలో నల్లబడతామేమో అన్న అనుమాంతో ఎక్కువగా రాయడం వల్ల విటమిన్ డిని కోల్పోవద్దు చెబుతున్నారు.

కాబట్టి.. సన్ స్క్రీన్ లోషన్‌ని అదేపనిగా రాయడం తగ్గించాలి. లేయర్ పై మరో లేయర్ అంటూ బయటికి వెళ్లిన ప్రతీసారి రాయొద్దు.. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వీడియో కూడా చూడండి..

First published: June 13, 2019, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading