Health Tips : స్నాక్స్ ఎక్కువగా తింటే ఒబేసిటి ముప్పు తప్పదు

ప్రతీకాత్మక చిత్రం

ఖాళీ సమయాల్లో చాలామంది స్నాక్స్ తింటుంటారు. కొంతమంది కడుపు ఖాళీగా ఉండొద్దని స్నాక్స్‌తో నింపేస్తుంటారు.. అయితే జాగ్రత్త ఎక్కువగా స్నాక్స్ తినడం వల్ల రోగాలు కొనితెచ్చుకున్నవారవుతారు.

  • Share this:
చాలా మంది స్నాక్స్‌ని ఇష్టంగా తింటుంటారు.. వర్క్‌ప్లేస్‌లో కూడా ఎక్కువగా తింటారు. అయితే, పని చేస్తూ తినడం వల్ల ఎంత తింటున్నామో తెలియదు.. దీంతో క్యాలరీలు ఎక్కువగా పెరిగి ఒబేసిటీ సమస్య పెరుగుతుందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చిప్స్, కాఫీ, బిస్కెట్స్, కేక్స్ ఇలా ఏవైనా సరే ఎక్కువ క్యాలరీలతో నిండి ఉంటాయి. కాబట్టి.. వీటిని తినే ముందు ఆలోచించడం మంచిది. ఎవరైనా మీకు ఆఫర్ చేసినా మొహమాటంతో తిని లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు.

కప్పు కాఫీలో 80 నుంచి 100 క్యాలరీలుంటాయి. ఇది అదనపు మీల్‌తో సమానం.. అదే విధంగా కేక్‌లో 1 నుంచి 12 గ్రాముల ఫ్యాట్, 300 నుంచి 400 క్యాలరీలుంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల అధికంగా బరువు పెరుగుతాం..

అంతగా తినాలనిపిస్తే డ్రై ఫ్రూట్స్, మొలకలు వంటివి తీసుకోవడం సమస్య దరిచేరదు. పైగా అదనపు లాభాలుంటాయి.
First published: