వామ్మో.. హ్యాండ్ బ్యాగ్స్‌లో ఇన్నిరకాలున్నాయా?

అప్పుడే టీనేజ్‌కి వచ్చిన అమ్మాయి నుంచి మధ్యవయస్సు దాటిన మహిళల వరకూ హ్యాండ్‌బ్యాగ్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బ్యాగ్స్‌కి ఇంత పాపులారిటీ ఉంది కాబట్టే రోజుకో కొత్త స్టైల్ బ్యాగ్స్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి.

Amala Ravula | news18-telugu
Updated: February 24, 2019, 5:15 PM IST
వామ్మో.. హ్యాండ్ బ్యాగ్స్‌లో ఇన్నిరకాలున్నాయా?
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 24, 2019, 5:15 PM IST
అప్పుడే టీనేజ్‌కి వచ్చిన అమ్మాయి నుంచి మధ్యవయస్సు దాటిన మహిళల వరకూ హ్యాండ్‌బ్యాగ్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బ్యాగ్స్‌కి ఇంత పాపులారిటీ ఉంది కాబట్టే రోజుకో కొత్త స్టైల్ బ్యాగ్స్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ట్రెండ్‌కి తగ్గట్లుగా మార్పులు చేసి డిజైనర్స్ వీటిని ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచుతున్నారు.
మరి ఇందులో ఏయే బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసా..
షోల్డర్ బ్యాగ్..

ఈ బ్యాగ్ మహిళలందరికీ అన్ని వేళలా ఉపయోగపడుతుంది. భుజాలకు వేసుకోవడానికి వీలుగా ఉండే ఈ బ్యాగులో సైజ్‌ని బట్టి మినీ మార్కెట్ క్యారీ చేయొచ్చు.
సాచెల్స్..
ఈ బ్యాగ్స్ ఉద్యోగం చేసే మహిళలకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. చూడ్డానికీ ల్యాప్‌టాప్ బ్యాగ్‌లానే ఉన్నప్పటికీ రెండింటికీ చాలా తేడా ఉంటుంది. ఈ బ్యాగ్ సైజ్‌లో కాస్తా చిన్నదిగా ఉంటుంది. వీటిని క్యారీ చేయడం వల్ల చిన్న చిన్న ఐటెమ్స్ కోసం మరో ఇతర బ్యాగ్ వాడాల్సిన అవసరం లేదు. గ్యాడ్జెట్స్‌కి ప్రత్యేకంగా ఓ పాకెట్ ఉంటుంది. కానీ ఈ బ్యాగ్‌ని తీసుకునే ముందు ప్రొడక్ట్ మంచిదేనా కాదా అని బాగా ఆలోచించాకే తీసుకోవాలి.స్లింగ్ బ్యాగ్స్..
Loading...
అప్పుడెప్పుడో పాతతరం సినిమాల్లో హీరోయిన్స్ వీటిని వాడేవారు. అప్పటి ఫ్యాషనే ఇప్పుడు సరికొత్తగా తయారై మళ్లీ అమ్మాయిల మనసు దోచేస్తుంది. దీనికి ఉన్న లెంథీ బెల్ట్ వల్ల జర్నీస్, ట్రావెలింగ్, షాపింగ్ సమయాల్లో ఇదో చక్కని ఛాయిస్. చిన్నపిల్లలు ఉండే తల్లులు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా వీటిని వాడొచ్చు. ఈ బ్యాగ్స్‌లోనూ రకరకాల సైజ్‌లున్నాయి.
క్విల్టెడ్ బ్యాగ్స్..
వీటి గురించి మరోరకంగా చెప్పాలంటే రిచ్ లుక్‌నిచ్చే బ్యాగ్స్ అని చెప్పొచ్చు. ధర కాస్తా ఎక్కువైనప్పటికీ వీటిని ఒక్కసారి కొనుగోలు చేస్తే చాలా సంవత్సరాలు మన్నుతాయి. వీటిని మీ ఫ్యాషన్‌లో భాగం చేసుకుంటే లుక్కే మారిపోతుందని చెప్పొచ్చు.

క్లచ్ బ్యాగ్స్..
పార్టీలు, ఈవెంట్స్‌కి సరిగ్గా సరిపోయే బ్యాగ్స్ క్లచ్ బ్యాగ్స్. అందంగా తయారై వీటిని వేసుకుంటే పార్టీలుక్ మీ సొంతమవుతుంది. అయితే.. ఇందులో ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే స్పేస్ తక్కువగా ఉండడం వల్ల అన్నీ ఐటెమ్స్‌ని క్యారీ చేయలేం. కానీ కొన్ని బ్రాండ్స్‌లో దొరికే ఈ క్లచ్ బ్యాగ్స్ ఎక్స్‌ట్రా కంపార్ట్‌మెంట్స్‌తో కంఫర్ట్‌గా ఉంటాయి.
మినాడిర్ బ్యాగ్స్
ఈ బ్యాగ్స్ క్లచ్ మాదిరిగానే ఉంటాయి. కానీ, అదనంగా రంగురాళ్లు, పూసలు వంటివి వీటికి అతికించి పార్టీ లుక్‌నిస్తారు. వివాహాలు, కాక్‌టెల్ పార్టీస్, స్పెషల్ ఈవెంట్స్‌కి ఇవి చక్కని ఆప్షన్.

హోబో బ్యాగ్స్..
షోల్డర్ బ్యాగ్స్ లానే ఉంటాయి హోబో బ్యాగ్స్. కానీ వాటికి ఉన్నంత స్పేస్ ఇందులో ఉండవు. దీర్ఘచతురస్త్రాకారంలో ఈ బ్యాగ్స్ ఉంటాయి. రెగ్యులర్ బ్యాగ్స్‌తో బోర్ కొడితే వీటిని చూస్ చేసుకోవచ్చు.
రిస్ట్ లెట్స్..
వ్యాలెట్స్ లానే ఉండే ఈ బ్యాగ్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వ్యాలెట్స్ కంటే ఎక్కువ పార్టిషన్స్ ఉండడం వల్ల ప్రతీ ఐటెమ్‌ని క్యారీ చేయొచ్చు.

బీచ్ బ్యాగ్..
ఔటింగ్స్‌కి వెళ్లినప్పుడు ఈ బ్యాగ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోనూ జూట్ బ్యాగ్స్ దొరుకుతున్నాయి. అవి వాటర్ ప్రూఫ్‌లోనూ దొరుకుతున్నాయి. చూడ్డానికి చక్కగానూ, సౌకర్యవంతంగా ఉంటాయి. ఎక్కవ స్పేస్ ఉండడం వల్ల ఓ జత డ్రెస్‌ని కూడా క్యారీ చేయొచ్చు.
వ్యాలెట్..
బయటికి వెళ్లినప్పుడు కార్డ్స్, మనీ క్యారీ చేసేందుకు ఉపయోగించే వ్యాలెట్స్ అమ్మాయిల ఫేవరెట్ ఐటెమ్ అని చెప్పొచ్చు. ఇందులోనూ సరికొత్త డిజైన్స్, కంఫర్ట్‌గా దొరుకుతున్నాయి.

సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం మీరు పాడుకోవచ్చుగా అదిరేటి బ్యాగ్ మేమేస్తే అని..
First published: February 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...