HOME »NEWS »LIFESTYLE »different and funny marriage traditions around the world here is details sk gh

Marriage traditions: కొత్తజంటను రూమ్‌లో పెట్టి తాళం.. నో బాత్‌రూమ్.. వెరైటీ పెళ్లి సంప్రదాయాలు

Marriage traditions: కొత్తజంటను రూమ్‌లో పెట్టి తాళం.. నో బాత్‌రూమ్.. వెరైటీ పెళ్లి సంప్రదాయాలు
ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి తరువాత వధూవరులను మూడు రోజుల పాటు ఒకే గదిలో ఉంచుతారు. ఈ సమయంలో వారు బాత్‌రూంకు వెళ్లేందుకు వీలుండదు.

  • Share this:
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ మధురానుభూతిని జీవితాంతం గుర్తుంచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటారు. అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఐతే వివిధ దేశాల్లో విభిన్న రీతిలో పెళ్లి చేసుకునే సంప్రదాయాలు ఉంటాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, తెగల వారీగా పెళ్లి వేడుకల్లో వైవిధ్యం కనిపిస్తుంది. భారత్‌లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా పెళ్లి వేడుకలు ఉంటాయి. మన దేశంలో ఇలాంటి సంప్రదాయాల గురించి ప్రజలకు అవగాహన ఉంటుంది. కానీ కొన్ని ప్రపంచ దేశాల్లో కూడా పెళ్లికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఈ వేడుకలకు సంబంధించి వివిధ దేశాల్లో కొన్ని ఆసక్తికరమైన సంప్రదాయాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.

భారతదేశం


మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెళ్లి రోజున పెళ్లికూతురు చెల్లెళ్లు వరుడి చెప్పులను, ఇతర వస్తువులను దాచిపెట్టే సంప్రదాయం ఉంది. అతడికి చెప్పులను తిరిగి ఇవ్వడానికి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ఈ సమయంలో తమ బావగారిని వారు ఆటపట్టిస్తారు. ఈ వేడుకను జూటా చుపాయి అంటారు. రెండు కుటుంబాల బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి మార్గమని ప్రజలు భావిస్తారు. ఇలాంటి సంఘటనలు పెళ్లిలో వినోదాన్ని పంచుతాయి.

నార్వే
నార్వేలో పెళ్లి రోజున ప్రత్యేకంగా తయారు చేసిన టవరింగ్ కేకును వడ్డిస్తారు. దీన్ని ఆల్మండ్ ఐస్ కేకు రింగులతో, ఒక కోన్ ఆకారంలో తయారు చేస్తారు. ఈ కేకు మధ్యభాగంలో ఒక వైన్ బాటిల్ ఉంటుంది. వధూవరులతో పాటు పెళ్లికి వచ్చినవారు ఆ వైన్ తాగుతూ కేక్‌ తినవచ్చు.

ఇండోనేషియా
ఈ దేశంలోని బోర్నియోలో, పెళ్లి తరువాత వధూవరులను మూడు రోజుల పాటు ఒకే గదిలో ఉంచుతారు. ఈ సమయంలో వారు బాత్‌రూంకు వెళ్లేందుకు వీలుండదు. ఇలా చేయడం వల్ల నవ దంపతుల మధ్య బంధం బలపడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీనివల్ల వారి మూత్రాశయం కూడా బలోపేతం అవుతుందని వారు చెబుతారు.

గ్రీస్
గ్రీస్ దేశంలో పెళ్లికి ముందు వధువు బంధుమిత్రులు వరుడికి షేవింగ్ చేస్తారు. షేవింగ్ చేసిన తరువాత, తన అత్త అతడికి తేనె, బాదం కలిపి తినిపించాలి.

జపాన్
జపాన్ అమ్మాయిలు పెళ్లిరోజున షింటో వేడుకను జరుపుకుంటారు. ఆరోజు వారు తల నుంచి కాళ్ల వరకు తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఆమె మేకప్ కూడా వైట్ కలర్లోనే ఉండాలి. ఆ డ్రెస్‌కు తలను కప్పే హుడ్ ఉంటుంది. దీన్ని 'త్సునోకుషి' అంటారు. తెలుపు రంగు వధువు కన్యత్వాన్ని సూచిస్తుంది. దుస్తులకు ఉండే హుడ్, కాబోయే అత్తగారిపై అసూయ అనే కొమ్ములను పెరగనీయకుండా చూస్తుందని నమ్ముతారు.

ఫిజీ
ఫిజీలో వరుడు, తనకు కాబోయే మామగారి వద్దకు వెళ్లి, తన కూతురిని ఇచ్చి పెళ్లిచేయమని అడగాలి. అలా అడిగినప్పుడు అతడు కాబోయే మామగారికి ఒక తిమింగలం దంతాన్ని కానుకగా ఇవ్వాలి.

జర్మనీ
జర్మన్ వధూవరులు పెళ్లి తరువాత, అతిధులు తిని పడేసిన ప్లేట్లను కడిగి, వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులను నిరోధించవచ్చని అక్కడి ప్రజలు భావిస్తారు.

చెక్ రిపబ్లిక్
ఈ దేశంలో వధూవరుల మంచంపై ఒక శిశువును ఉంచడం ఆచారంగా వస్తోంది. పెళ్లి అయిన తరువాత, అతిధులు వారికి పప్పుధాన్యాలు, బియ్యం, బఠానీలతో స్నానం చేయిస్తారు. ఇలాంటి పద్ధతులు సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తాయని వారు నమ్ముతారు.

గ్వాటెమాల
గ్వాటెమాలలో పెళ్లి తరువాత బియ్యం, ఇతర ధాన్యాలు, పిండితో ఉన్న ఒక సిరామిక్ బెల్‌ను పగలగొట్టమని వరుడిని అతడి తల్లి ఆదేశిస్తుంది. ఇవి వధూవరులకు సౌభాగ్యాన్ని తీసుకువస్తాయని నమ్ముతారు.

ఫ్రాన్స్
ఫ్రాన్స్‌లో పెళ్లి రిసెప్షన్ తరువాత వధూవరులు షాంపైన్, చాక్లెట్లను టాయిలెట్ బౌల్‌లో తినాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మొదటి రాత్రికి ముందు వారిద్దరి మధ్య బంధం బలోపేతమవుతుందని భావిస్తారు. కానీ ఈ ఆచారం ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు.
Published by:Shiva Kumar Addula
First published:January 27, 2021, 12:59 IST