డైటింగ్ చేసే అమ్మాయిల్లో కొత్త కొత్త అలవాట్లు... టీనేజ్ గర్ల్స్ విషయంలో అయితే మరీ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫిట్ నెస్ ఛాలెంజ్ ట్రెండింగ్ లో నడుస్తోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా తారలందరూ తమ కసరత్తుల వీడియోలను పోస్టు చేస్తూ యువతలో కూడా ఫిట్ గా వుండాలనే తపనా తాపత్రయం పెంచుతున్నారు. కండలు తిరిగిన శరీరం పెంచాలనే తాపత్రయం మంచిదే... కానీ ఆ ఉద్దేశంతో విపరీతంగా డైటింగ్ చేయడం మాత్రం అస్సలు మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. డైటింగ్ వల్ల టీనేజ్ యువతలో మద్యం, స్మోకింగ్ వంటి దురలవాట్లు కూడా పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

Chinthakindhi.Ramu | news18
Updated: March 22, 2019, 5:26 AM IST
డైటింగ్ చేసే అమ్మాయిల్లో కొత్త కొత్త అలవాట్లు... టీనేజ్ గర్ల్స్ విషయంలో అయితే మరీ...
నమూన చిత్రం (Photo courtesy: AFP Relaxnews/ Nikodash/ IStock.com)
Chinthakindhi.Ramu | news18
Updated: March 22, 2019, 5:26 AM IST
టీనేజీ యువత... వారి అలవాట్లపై ఓ అధ్యయనం చేసింది కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ. దాదాపు 3300 మంది టీనేజ్ అమ్మాయిలపై జరిపిన ఈ అధ్యయనంలో కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో స్లిమ్ గా ఉండాలనే తపన ఎక్కువగా ఉంటుంది. స్లిమ్ లుక్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో టీనేజ్ వయసు రాగానే నోటికి తాళం వేసేస్తారు చాలామంది. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే పొద్దునే తీసుకునే ఆహారం తగినంత ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అవసరం. కానీ డైటింగ్ చేస్తున్నవారిలో చాలామంది టీనేజ్ అమ్మాయిలు, బరువు పెరుగుతామనే భయంతో ఉదయాన్నే అల్ఫాహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఒకరకంగా ఇది వారిలో అనేక దురలవాట్లు పెరగడానికి కారణమవుతోంది. ముఖ్యంగా వీరిలో చాలామంది ఆకలి తగ్గించుకునేందుకు సిగరెట్ల వైపు వెళుతున్నారు.

మిగిలిన వారితో పోలిస్తే డైటింగ్ చేస్తున్న పిల్లల్లో 60 శాతం మందికి ఎక్కువగా పొగ తాగే అలవాటు ఉండడమే దీనికి నిదర్శనం. అంతేకాకుండా మద్యాపానానికి అలవాటు పడుతున్న అమ్మాయిల సంఖ్య కూడా 50 శాతం ఎక్కువగా ఉంది.

‘డైటింగ్ చేస్తున్నవారితో పోలిస్తే, ఆహారం విషయంలో ఎటువంటి నియమాలు పెట్టుకోని అమ్మాయిలు చాలా ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. డైటింగ్ చేస్తున్నవారిలో 70 శాతం మంది ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. బరువు తగ్గాలనే ఆలోచన చాలా మంచిదే... కానీ దానికి ఎంచుకునే మార్గాలే సరైనవి కావు. అందుకే బరువు తగ్గాలనే ఆలోచన, డైటింగ్ కూడా టీనేజ్ అమ్మాయిల్లో ఒకరకమైన మానసిక ఒత్తిడి పెరగడానికి కారణమవుతోంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు వాళ్లు పెడదారి పడుతున్నారు. సరైన గైడెన్స్ లేకపోవడం కూడా అమ్మాయిల్లో ఈ దురలవాట్లు పెరగడానికి ప్రధాన కారణం...’ అని అంటున్నారు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న కెనడీయన్ పబ్లిక్ హెల్త్ జర్నల్ అమాండ రఫూల్.

‘డైటింగ్ చేయడం అంటే తిండి మానేయడం కాదు. అనవసర చెత్తంతా లోపల వేయడం మానేయాలనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి. బరువు తగ్గాలని అసలే తినకుండా మానేస్తే శారీరక, మానసకి సమస్యలు పెరుగుతాయి.ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ చేయడం మానవద్దు. లంచ్, డిన్నర్ సమయాల్లో మాత్రం కార్బోహైడ్రెడ్స్ తక్కువగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి. ఆకలి వేయకుండా స్మోకింగ్, డ్రింకింగ్ వంటి వాటికి అలవాటు పడేకంటే... ఆకలి వేసినప్పుడే తక్కువ తక్కువ మోతాదులో పండ్లు, సలాడ్స్ వంటివి తినడం అలవాటు చేసుకుంటే... బరువు పెరగకుండా నియంత్రించవచ్చు. బరువు నియంత్రణలో ఉండాలంటే డైటింగ్ తో పాటు వ్యాయామం కూడా అవసరమని గుర్తించండి...’ అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.
First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...