Dieting And Exercising : బరువు తగ్గాలని అనుకుంటే... కచ్చితంగా తగ్గాల్సిందే. అధిక బరువు ఎప్పటికీ మంచిది కాదు. ఐతే... బరువు తగ్గేందుకు కొన్ని ఆరోగ్య పద్ధతులు పాటించాలి. చాలా మంది త్వరగా బరువు తగ్గాలనే మంచి ఆలోచనతో... డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ ఒకేసారి చేస్తుంటారు. ఇది ఎముకలకు ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే... డైటింగ్ వల్ల... శరీరానికి ఇవ్వాల్సిన ఆహారం తగ్గిపోతుంది. అదే సమయంలో ఎక్సర్‌సైజ్ చేస్తే... శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా... కండరాలతోపాటూ... ఎముకలకు కూడా కావాల్సినంత పోషకాలు అందవు. ఒకే సమయంలో పెద్ద మొత్తంలో పోషకాలు తగ్గిపోతే... ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయంలో మహిళలు ఎక్కువ జాగ్రత్త పడాలి. మన ఏజ్ పెరుగుతున్నకొద్దీ సహజంగానే ఎముకల్లో బలం తగ్గిపోతుంది. బలం పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే సమయంలో డైటింగ్, ఎక్సర్‌సైజ్ చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితిపై నార్త్ కరొలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ ఒకేసారి చేసేవారిలో... ఎముకల మధ్యలో ఉండే బోన్ మ్యారో ఫ్యాన్ పెరిగిపోతోంది. సరైన పోషకాలు అందకపోవడంతో ఎముకలు... ఫ్యాట్‌తో నిండిపోతున్నాయి. ఇది ఎముకల పటిష్టతను దెబ్బతీస్తుంది.
30 ఏళ్ల వయసుండే మహిళలు... రోజుకు 2,000 కేలరీల శక్తికి సరిపడా ఫుడ్ తినాల్సిందే. డైటింగ్ చేసేవారు... 30 శాతం తక్కువ ఆహారం తీసుకుంటున్నారు. ఫలితంగా కేలరీల సంఖ్య 1400కి పడిపోతోంది. ఫలితంగా మహిళలు వారానికి 450 గ్రాముల (ఒక పౌండ్) బరువు తగ్గిపోతున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఎముకలకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు పరిశోధకులు. అందువల్ల డైటింగ్ చెయ్యడం మానేసి... మంచి ఆహారం తింటూ... ఎక్సర్‌సైజ్ చెయ్యడం మేలంటున్నారు పరిశోధకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health benefits, Health Tips, Tips For Women, Weight loss, Women health