DID YOU KNOW WHAT WOULD THE AUTHORITIES DO TO WOMEN IN THOSE COUNTRIES IF THEY WORE BIKINIS PRV
Dress code for girls: ఆ దేశాల్లో మహిళలు బికినీలు వేసుకుని తిరగొద్దంట .. తిరిగితే ఏం చేస్తారో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం (Image; Reuters)
ఒక్క ఆప్ఘన్లోనే కాదు కొన్ని కఠిన ఆంక్షలు పలు దేశాల్లోనూ ఉన్నాయి. అందులో కొన్ని ప్రత్యేక దుస్తులను (dress) మాత్రమే మహిళలు ధరించాలంటూ చట్టాలూ ఉన్నాయి. మరికొన్ని దేశాల్లో (Few countries) బికినీ (bikini)లను ధరించడంపై (wearing) నిషేధం విధించారు. ఆ దేశాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
ఆప్ఘన్ (Afghanistan) లో తాలిబన్ల ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. తాము గతంలో మాదిరిగా లేమని, పూర్తిగా మారిపోయామని.. మహిళలపై గతంలో మాదిరిగా ఆంక్షలు విధించబోమని తాలిబాన్లు (Taliban's) తొలుత చెప్పినప్పటికీ ఆప్ఘన్లో మహిళల (Women) భద్రతపై, వారి హక్కులపై ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆప్ఘన్లో షరియా చట్టాన్ని అమలు చేస్తామని తాలిబన్లు ప్రకటించడం అక్కడి మహిళల విషయంలో వాళ్లు చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తివేనని తేల్చేసింది. ఈ నేపథ్యంలో.. ఆప్ఘన్ మహిళలు (women) మళ్లీ అప్పటి తాలిబన్ల పాలన పునరావృతం అవ్వబోతుందన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఒక్క ఆప్ఘన్లోనే కాదు కొన్ని కఠిన ఆంక్షలు పలు దేశాల్లోనూ ఉన్నాయి. అందులో కొన్ని ప్రత్యేక దుస్తులను (dress code for girls) మాత్రమే మహిళలు ధరించాలంటూ చట్టాలూ ఉన్నాయి. మరికొన్ని దేశాల్లో (Few countries) బికినీ (bikini)లను ధరించడంపై (wearing) నిషేధం విధించారు. ఆ దేశాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ..
ముస్లిం (Muslim) దేశాల్లో బికినీల పట్ల నిషేధం (ban) విధించడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని రాస్ అల్-ఖైమా రాష్ట్రం, దాని సముద్ర తీరాల్లో పురుషులు, యువతులు (girls) ఇద్దరూ బికినీలు లేదా ఈత దుస్తులు ధరించడం (Ban on swimming dress) నిషేధించబడింది. కొన్ని ముస్లిం కుటుంబాలు అక్కడి బీచ్ లలో శరీర ప్రదర్శన చేసే టూరిస్టులతో కలిసి ఆనందించేందుకు ఆసక్తి చూపించరు. ఇక్కడికి దాదాపు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్ బీచ్ లలో ఇలాంటి నిషేధం (ban) లేదు. కానీ బీచ్ (beach) లకు వెళ్లే వారికి అధికారులు ఇతర సందర్శకులకు ఇబ్బంది లేకుండా గౌరవప్రదంగా నడుచుకోవాలని సూచిస్తుంటారు.
స్పెయిన్..
2011లో బార్సిలోనా (Barcelona) & మల్లోర్కా, స్పెయిన్ (Spain) వీధుల్లో బికినీ ధరించి తిరగడం నిషేధించారు. ఇక్కడ బీచ్ లలో, వాటి చుట్టు పక్కల వీధుల్లో మాత్రమే తిరిగేందుకు అనుమతి ఉంది. దీనిని అతిక్రమించి టూ పీస్ బికినీ వేసుకుని తిరిగే వారికి 500 యూరోల (రూ.39 వేలు) వరకూ జరిమానా (fine) విధించబడుతుంది.
పర్యాటక గమ్యస్థానం..
అందమైన పర్యాటక గమ్యస్థానంగా మాల్దీవులకు (Maldives) ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడికి విదేశీ టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పబ్లిక్ బీచ్ లలో ఈత దుస్తులు, బికినీలు ధరించడం ఇక్కడ నిషేధం. కొన్ని రిసార్ట్ బీచ్ లకు మాత్రమే ఈ దుస్తులకు అనుమతి ఉంది. ఇది ముస్లిం దేశం కావడంతో ఈ నియమాలను కఠినంగా పాటిస్తారు. అతిక్రమించిన వారు అరెస్టు కాక తప్పదు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.