Health Tips: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలి అంటే రోజూ ఇలా చేయండి.. ఐదు రకాల పండ్లు.. కూరగాయలు తింటే చాలు

ఈ ఐదు తింటే ఆయుష్షు పెంచుకున్నట్టే

Health Benefits: ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ గజగజా వణికించింది. ఇక సెకెండ్ వేవ్ అయితే లక్షలాది మంది ప్రాణాలు తీసేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, సామాజిక, ఆర్థిక సమస్యలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో హెల్తీ ఫుడ్ తీసుకోవాలని సూచిస్తుంటారు డాక్టర్స్. ముఖ్యంగా రోజూ పండ్లు తినాలని.. అలాగే తాజా కూరగాయలను తినాలని చెబుతుంటారు. అయితే ఏం తీసుకోవాలో మీకు తెలుసా..?

 • Share this:
  Health Tips: ప్రతిరోజూ 5 రకాల పండ్లు.. కూరగాయలు తింటే ఎక్కువ రోజులు ఆరోగ్యంగా (Healthy) జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. తాజాగా హార్వర్ట్ యూనివర్సిటీ (Harvard University) జరిపిన పరీక్షలలో  ఐదు రకాల పండ్లు (Fruits).. కూరగాయాలు (Vegitables) తినడం వలన వ్యాధులకు చెక్ పెట్టెయ్యొచ్చని తెలీంది. అంతేకాదు.. ఆకాస్మాత్తుగా మరణించే ప్రమాదం తగ్గుతుందట. ఇది ఏదో నోటి  మాటగా చెబుతున్నది కాదు..  ఈ అధ్యయనం సర్క్యులేషన్ జర్నల్‌లో ప్రచురించబడింది. ఈ అధ్యయనాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత 30 సంవత్సరాలలో రెండు మిలియన్ల మంది ఆహారం.. ఆరోగ్య డేటాను విశ్లేషించారు నిపుణులు. ఈ అధ్యయనం కోసం డేటా ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాల నుండి తీసుకున్నారు. తాజా అధ్యాయనం ప్రకారం ప్రతి రోజూ కూరగాయలు.. ఐదు రకాల పండులు తినేవారికి ఆరోగ్యం బాగుంటుందని.. అనారోగ్య సమస్యలు ఉండవని.. ముఖ్యంగా అకాల మరణించే ప్రమదాన్ని 13 శాతం తగ్గుతుందని తెలీంది. అలాగే గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు 12 శాతం తగ్గాయట. అంతేకాదు.. క్యాన్సర్ (Cancer) కారణంగా మరణించే వారి సంఖ్య 10 శాతానికి పైగా తగ్గిందని.. శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం కూడా 35 శాతం తగ్గిందని వెల్లడి అయ్యింది.  .

  రోజుకు 5 పండ్లు.. కూరగాయలు తీసుకోవడంతో అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. ఈ అధ్యాయనం జరిపిన ప్రధాన రచయిత డాక్టర్ డేనయిల్ వాంగ్ మాట్లాడుతూ.. పండ్లు కూరగాయలలో అనేక పోషకాలున్నాయని.. ఇవి మనకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుతాయని అన్నారు. పొటాషియం.. మెగ్నీషియం.. ఫైబర్, పాలీఫోనాల్స్ ఉన్నందున వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉన్నాయని.. ఇవి గుండె.. రక్తనాళాలను మెరుగుపరుస్తాయని తెలిపారు.

  ఇదీ చదవండి : మద్యం హోం డెలివరీపై ప్రజల అభిప్రాయం ఏంటంటే..? హైదరాబాదీల మనసులో మాట

  తాజా అధ్యాయనం ప్రకారం.. రోజూ పండ్లు, ఆకు కూరలు.. కూరగాయలు తీసుకోడవంలొ అనారోగ్య సమస్యలు దరిచేరవు. వీటిలో విటమిన్ సీ, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. పాలకూర, క్యాబేజీ, నారింజ, బెర్రీలు, క్యారెట్స్ తీసుకోవడం మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్.. క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. 

  అయితే ఐదు రకాల పండ్లు, ఐదు రకాల కూరగాయాలు ఏ పరిమాణంలో తీసుకోవాలో చెక్ చేద్దాం.. ప్రతిరోజు ఆపిల్ ఒకటి, నేరేడు పండు.. ఒకటి లేదా అరకప్పు, అవకాడో.. సగం లేదా అర కప్పు, అరటి పండు ఒకటి, బ్లూబెర్రీ, అర కప్పు ద్రాక్షలు, ఒకటి లేదా రెండు కప్పులు, నారింజ ఒకటి, స్ట్రాబెర్రీ అరకప్పు, కాలీఫ్లవర్, అరకప్పు మొలకలు, అరకప్పు క్యాబేజీ,
  క్యారెట్ 80 నుంచి 85 గ్రాములు, వంద గ్రాములు వంకాయలు, ఆవాలు ఆకుకూరలు అరకప్పు, పాలకూర కప్పు, మిశ్రమ కూరగయాలు అరకప్పు, ఉల్లిపాయ ఒకటి, బీన్స్ అరకప్పు, రెండు టమోటా, కూరగాయల సూప్ ఒక కప్పు, తియ్యటి బంగాళ దుంపలు 100 గ్రాములు.
  Published by:Nagesh Paina
  First published: