Hair fall: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? అయితే ఈ జీలకర్ర నూనెతో మీ సమస్యను దూరం చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

తలలో చర్మం పొడిబారి చుండ్రు (dandruff), జుట్టు రాలే సమస్యలు వస్తాయి. అందుకే వారానికి రెండు సార్లయినా నూనె అప్లై చేయాలి. అందుకే ఇప్పుడు ఆ సహజ పదార్థాలతో జుట్టుని కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

  • Share this:
    చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్ల జుట్టు  (white hairs) చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె (oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు (hair) అందరికీ ఉండేది.

    కానీ ఇప్పటి కాలుష్యం (pollution), షాంపూలు (shampoos), హెయిర్ ప్రొడక్ట్స్ (hair products) పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దానివలన తలలో చర్మం పొడిబారి చుండ్రు (dandruff), జుట్టు రాలే సమస్యలు వస్తాయి. అందుకే వారానికి రెండు సార్లయినా నూనె అప్లై చేయాలి. అందుకే ఇప్పుడు ఆ సహజ పదార్థాలతో జుట్టుని కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

    నల్ల జీలకర్ర నూనెతో..

    నల్ల జీలకర్ర నూనె (Black cumin oil ) అధికంగా జుట్టు రాలడాన్ని (hair fall) తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, బలంగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో థైమోక్వినోన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటిహిస్టామైన్. ఇది జుట్టు తిరిగి పెరగడానికి (hair growth), జుట్టు సన్నగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్ (anti accidents) లక్షణాలను కలిగి ఉంది. ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, ఐరన్ (iron)​, విటమిన్ సి వంటి ఇతర పోషకాలు కూడా జుట్టుకు బాగా పనిచేస్తాయి.

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

    టేబుల్ స్పూన్ల నల్ల జీలకర్ర నూనె తీసుకొని, తలమీద రుద్దండి. ఆ తరువాత నెత్తికి మసాజ్ చేయాలి. జుట్టు రాలడం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాగా మసాజ్ చేయాలి. నూనెను మూలాల నుంచి చివర వరకు జుట్టుకు రాయాలి. నూనె రాసిన తరువాత జుట్టును 30 నిమిషాల నుంచి గంట వరకు ఆరబెట్టండి. ఆపై షాంపూతో మీ జుట్టును కడగాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం వల్ల మీ జుట్టు అది ఉత్తేజ పరుస్తుంది.  జుట్టులో పెరుగుదల జరుగుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  26 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లూయన్సర్ల డేటా లీక్​.. గుర్తించిన సెక్యూరిటీ పరిశోధకులు
    Published by:Prabhakar Vaddi
    First published: