Fat Tax: లావుగా ఉంటే ట్యాక్సు..? సైజు మారే కొద్దీ పన్ను..! ఎక్కడో తెలుసా..?

బరువుగా ఉంటే ట్యాక్స్ విధిస్తారట.. ఎక్కడో కాదు మనదగ్గరే. అదేంటి తిండి ఆపేయమంటున్నారా ఏంటీ.. అనుకుంటున్నారా..? ఆగండాగండి... తిండి ఆపమనడం లేదు. కానీ ఇది చదవండి.

news18
Updated: November 5, 2020, 12:23 PM IST
Fat Tax: లావుగా ఉంటే ట్యాక్సు..? సైజు మారే కొద్దీ పన్ను..! ఎక్కడో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 5, 2020, 12:23 PM IST
  • Share this:
భారతీయ రిటైల్ బ్రాండ్లు ఇటీవల కాలంలో సైజ్ రేంజ్ లను పెంచాయి. బరువు ఎక్కువ ఉన్నవారికి ఇది శుభవార్తే అయినప్పటికీ రిటైల్ బాండ్ల ప్రేరణ నిజంగా సరైన రీతిలో లేదని తెలుస్తోంది. భారతీయ సమాజం సన్నగా ఉండే వ్యక్తులతో నిమగ్నమైంది. కాబట్టి భారత్ లో అధిక బరువు ఉండటం సవాలుగా మారనుంది. లావుగా ఉండే వారికి వేల రూపాయలు ఖర్చవుతాయి. ముఖ్యంగా దుస్తుల విషయంలో ఎక్కువ సైజు తయారు చేయడం వల్ల కంపెనీలు ఫ్యాట్ ట్యాక్స్ (అచ్చ తెలుగులో చెప్పాలంటే మన శరీరంలో ఉండే కొవ్వు మీద పన్ను) వసూలు చేస్తున్నాయి. కొవ్వుపై పన్ను ఏంటి అని అనుకుంటున్నారా..? అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే.

అధిక బరువు ఉన్నందుకు ప్లస్ సైజ్ మహిళల నుంచి ఓవర్ వెయిట్ లేదా స్థూలకాయులకు రిటైల్ బ్రాండ్లు ఫ్యాట్ ట్యాక్స్ రూపంలో డబ్బును వసూలు చేస్తున్నాయి. దీనిపై డైట్ సబ్యా అనే అనామక ఇన్స్టాగ్రామ్ ఖాతాదారు సోనమ్ కపూర్, ఆలియా భట్ లాంటి వారికి పిలుపునిచ్చారు. ఫ్యాషన్ ప్రపంచంలో అస్పష్టమైన కాపీలను, అనుకరణలను ఈ ఖాతాను జత చేశారు.

ఫ్యాట్ ట్యాక్స్ అంటే..?
ఇది అనారోగ్య ఆహారాలపై విధించిన పన్ను కాదు. ఇది ప్లస్-సైజు వినియోగదారులకు ఖర్చు పెంచనుంది. ప్లస్-సైజు దుస్తులకు ఎక్కువ పదార్థం అవసరమని భావించి లార్జ్ (L) లేదా XL సైజుల వారు ఎక్కువ అదనపు సొమ్ము చెల్లించాల్సి వస్తుంది. అయితే S లేదా M సైజును కలిగిన వారు సొమ్ము చెల్లించాల్సిన పనిలేదు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఐశ్వర్య సుబ్రహ్మణ్యం ఫ్యాట్ ట్యాక్స్ పై చర్చ లేవనెత్తడంతో ఇది ప్రారంభమైంది. సైజు ఎక్కువ ఉంటే డబ్బు అదనంగా ఫ్యాట్ ట్యాక్స్ వసూలు చేస్తోన్న బ్రాండ్ గురించి చర్చ మొదలైంది.

ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో పలువురు షాకింగ్ అనుభవాలను పంచుకున్నారు. ప్లస్ సైజ్ వినియోగదారులకు మద్దతుగా చాలా మంది డిజైనర్లు ముందుకు వచ్చారు. మీకు నిజంగా అదనపు ఫ్యాబ్రిక్ అవసరమైతే దాని గురించి చర్చించాలని అన్నారు.

బీబీసీ నివేదిక ప్రకారం.. సాంప్రదాయ రిటైలర్లు తమ పరిధులను విస్తృతం చేయటం నిజంగా కలుపుకొని ఉండకపోవటం ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే అవి వివిధ రకాలైన వాటికంటే పరిమిత సంఖ్యలో పెద్ద సైజులను అందిస్తున్నాయి. కంపెనీలు ప్లస్ సైజు ఎంపికలను జోడించినప్పుడు వారు తమ టార్కెట్ మార్కెట్లో తప్పుడు మార్గాలు ఎంచుకోవడానికి చాలా ఉన్నాయి. న్యూ లుక్ బీబీసీ ప్రకారం.. 2018లో బ్రిటీష్ రిటైలర్ ఎంచుకున్న ప్లస్ సైజు వస్త్రాలను సరళ పరిమాణాల్లో పోల్చదగిన వస్త్రాల కంటే 15 శాతం ఎక్కువ అమ్మిన తర్వాత ఫ్యాట్ ట్యాక్స్ ను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది.

ప్లస్ సైజు వినియోగదారులను ఏళ్ల తరబడి విస్మరించారు. అంతేకాకుండా ఈ బ్రాండ్లు అవగాహనతో మరింత ప్రగతిశీలంగా కనిపించాలని కోరుకుంటాయి. అయితే డైట్ సబ్యా లాష్ అవుట్ అయిన తరువాత, డిజైనర్ ద్వయం గౌరీ-నైనికా, రా మ్యాంగోతో సహా బ్రాండ్లు ఫ్యాట్ ట్యాక్సును తొలగించాలని నిర్ణయించాయి.
Published by: Srinivas Munigala
First published: November 5, 2020, 12:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading