హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: మలబద్దకం తీవ్రంగా బాధిస్తుందా.. అయితే ఈ ఒక్క కాఫీతో మలబద్దకానికి చెక్​ పెట్టయేచ్చు.. ఎలాగంటే..

Health tips: మలబద్దకం తీవ్రంగా బాధిస్తుందా.. అయితే ఈ ఒక్క కాఫీతో మలబద్దకానికి చెక్​ పెట్టయేచ్చు.. ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండా పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది. మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. మానవునికి వచ్చే చాలా రకాల వ్యాధులకు ‘మలబద్ధకమే(Constipation)’ మూల కారణంగా ఉంటుంది.

ఇంకా చదవండి ...

  సమాజంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం(Constipation). దీనికి ప్రధాన కారణం- మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండా పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది. మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. మానవునికి వచ్చే చాలా రకాల వ్యాధులకు ‘మలబద్ధకమే(Constipation)’ మూల కారణంగా ఉంటుంది. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు (digestive disease), హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి (headache) వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లో మలబద్ధకం అత్యంత సాధారణ జీర్ణ సమస్య. ఇది జనాభాలో 2 % నుండి 20 % మందికి సంభవిస్తుంది. ఇది మహిళల్లో ఎక్కువగా పెద్దలు, పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇది పెద్దవారిలో వ్యాయామం చేయకపోవడము వలన, వయసుతో పాటు వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల వలన తరచుగా సంభవిస్తుంది.

  కాఫీలతో హాయిగా..

  ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ (Coffee) తాగితే ఒత్తిడి (Stress) తగ్గిపోతుంది. అలాగే ఎంతో ప్రశాంతంగా కూడా ఉండొచ్చు కొంత మంది కాఫీని తాగడం వల్ల బాత్ రూమ్ కి ఫ్రీగా వెళ్లొచ్చు అని అనడం వినే ఉంటాం. అయితే దీని వెనుక కారణం ఏమిటంటే..? కాఫీ డైజెస్టివ్ సిస్టం లో ఉండే మజిల్స్ (Muscles) ని స్టిమ్యులేట్ చేస్తుంది. కాఫీలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మలబద్ధకం నుంచి బయట పడటానికి సహాయం చేస్తాయి.

  మలబద్ధకం(Constipation)  సమస్య తో బయట పడాలి అంటే కాఫీ(coffee) తాగండి. అది కూడా కేఫినేటెడ్ కాఫీ తీసుకోండి. ప్రో బయోటిక్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం (Constipation) నుంచి బయట పడవచ్చు. ప్రోబయోటిక్ కలిగిన ఫుడ్ ఎందులో ఉంటుంది అనే విషయానికి వస్తే.... యోగర్ట్, కించి ఇలాంటి వాటిల్లో దొరుకుతాయి. ప్రోబయోటిక్ ఫుడ్స్ ఉన్నవి తీసుకోవడం వల్ల మీరు సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.

  డీ హైడ్రేట్ (Dihydride) అయిపోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. అయితే మలబద్దకం నుండి బయట పడాలి అంటే మీరు ఎక్కువగా హైడ్రేట్ (hydride) గా ఉండాలి. పూర్తిగా హైడ్రేట్ గా ఉండాలంటే మీరు ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. మీరు ఎప్పుడైతే ఎక్కువ నీళ్లు తాగుతారో అప్పుడు ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అలానే మలబద్ధకం తో ఇబ్బంది పడేవాళ్ళు కార్బోనేటేడ్ వాటర్ తాగడం వల్ల కాస్త రిలీఫ్ గా ఫీల్ అవుతారు. కాబట్టి దాన్ని కూడా తీసుకోవచ్చు. అలా అని మీరు షుగర్ సోడాని తీసుకోవద్దు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ayurveda health, Food, Health Tips

  ఉత్తమ కథలు