హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Weight Loss Drinks: ఆ డ్రింక్స్‌తో బరువు తగ్గడం కష్టమే.. ప్రచారంలో ఉన్న ప్రముఖ పానీయాలతో ప్రయోజనం శూన్యమేనా?

Weight Loss Drinks: ఆ డ్రింక్స్‌తో బరువు తగ్గడం కష్టమే.. ప్రచారంలో ఉన్న ప్రముఖ పానీయాలతో ప్రయోజనం శూన్యమేనా?

చదువులు, ఉద్యోగాలు, ఇతర పనులు, ఇంటి పనులు అన్నీ ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి. ఇక పిల్లలకైతే ఆటల్లో పడిపోయే ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియని లోకంలో బతికేస్తున్నారు.

చదువులు, ఉద్యోగాలు, ఇతర పనులు, ఇంటి పనులు అన్నీ ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి. ఇక పిల్లలకైతే ఆటల్లో పడిపోయే ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియని లోకంలో బతికేస్తున్నారు.

నీరు, పానీయాలు బాడీని డిటాక్సిఫై చేయడంలో దోహదపడతాయే తప్ప అవి శరీర బరువును తగ్గించలేవని నిపుణులు చెబుతున్నారు. వెయిట్‌లాస్‌లో మూడు పానీయాలను చాలామంది విరివిగా వాడుతున్నారని.. వాటివల్ల అనారోగ్యాలు కోరి తెచ్చుకోవడం తప్ప బరువు తగ్గడం జరగదని హెచ్చరిస్తున్నారు.

ఇంకా చదవండి ...

ఈ రోజుల్లో అధిక బరువు (Heavy weight) సమస్య ఎంతోమందిని వేధిస్తోంది. ఎలాగైనా బరువు తగ్గిపోవాలని చాలామంది ఊబకాయులు (obesity) కోరుకుంటుంటారు. ఈ క్రమంలో తక్కువ సమయంలో కిలోల చొప్పున బరువు తగ్గేందుకు ప్రముఖ డ్రింక్స్ పై ఆధారపడుతుంటారు. ఈ డ్రింక్స్ తాగితే చాలు.. వద్దన్నా బరువు తగ్గిపోతామని (weight loss) భ్రమ పడతారు. కానీ ఇలాంటి డ్రింక్స్ నిజంగా బరువు తగ్గించగలవా? ఈ డ్రింక్స్ పుచ్చుకున్నంత మాత్రాన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు (cholesterol) కరుగుతుందా? అని ప్రశ్నిస్తే అది అసాధ్యమని అంటున్నారు వైద్యులు. కేవలం పానీయాలతో బరువు తగ్గడం (weight loss) అంత సులభమేమీ కాదంటున్నారు. హెల్దీగా, స్థిరంగా బరువు తగ్గాలంటే హెల్దీ ఫుడ్ (healthy food) తీసుకుంటూ నిరంతరం వ్యాయామం (exercise) చేయడమే ఉత్తమమైన మార్గమని సూచిస్తున్నారు.

మూడు పానీయాలు..

నీరు (water), పానీయాలు (drinks) బాడీని డిటాక్సిఫై చేయడంలో దోహదపడతాయే తప్ప అవి శరీర బరువును తగ్గించలేవని నిపుణులు చెబుతున్నారు. వెయిట్‌లాస్‌ (weight loss)లో మూడు పానీయాలను చాలామంది విరివిగా వాడుతున్నారని.. వాటివల్ల అనారోగ్యాలు కోరి తెచ్చుకోవడం తప్ప బరువు తగ్గడం (weight loss) జరగదని హెచ్చరిస్తున్నారు. మరి ఆ డ్రింక్స్ ఏవో తెలుసుకుందాం.

* అల్లం, తేనె, నిమ్మకాయ నీరు (ginger, honey, lemon water)

అల్లం (ginger), తేనె (honey), నిమ్మకాయ (lemon)తో తయారుచేసిన గోరువెచ్చని మిక్స్‌డ్ డ్రింక్ చాలా రుచిగా ఉంటూ మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అందిస్తుంది. దీన్ని పరగడుపున తాగడం వల్ల బరువు తగ్గవచ్చని ప్రజలు భావిస్తారు. కానీ ఇది వట్టి అపోహ మాత్రమే. ఈ పానీయంలో పోషకాలు ఉండటంతో పాటు.. ఇది మీ రోగనిరోధక శక్తి (Immunity system)ని పెంచుతుంది.. అలాగే మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. కానీ ఈ డ్రింక్ కొవ్వు కరిగించడంలో ఎలాంటి పాత్ర పోషించదు. అందువల్ల ఈ డ్రింక్ పరగడుపున తాగినా ఎలాంటి వెయిట్ లాస్ (weight loss) ప్రయోజనాలు కనిపించవు.

* గ్రీన్ టీ (green tea)

అత్యంత ప్రాచుర్యం పొందిన వెయిట్‌లాస్‌ డ్రింక్స్‌లో గ్రీన్ టీ (green tea) కూడా ఒకటి. కొందరు బరువు తగ్గాలనే తపనతో 3-4 కప్పులు లేదా అంతకన్నా ఎక్కువ గ్రీన్ టీ తాగుతుంటారు. ఇది చాలా హెల్దీ డ్రింక్‌యే అయినప్పటికీ.. వెయిట్‌లాస్‌లో దీని ఉపయోగం శూన్యం. గ్రీన్ టీ మీ జీవక్రియ రేటును గణనీయంగా పెంచుతుంది. అయితే మీరు దానిని ఎక్కువగా తాగితే అనారోగ్యం పాలవుతారు.

* యాపిల్ సిడార్ వెనిగర్(Apple cider vinegar)

యాపిల్ సిడార్ వెనిగర్ (apple cider vinegar) బరువు తగ్గించే పానీయంగా బాగా ప్రాచుర్యం పొందింది. నిజానికి ఇది గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేసి, షుగర్ వ్యాధి ముప్పును తగ్గిస్తుంది కానీ బరువు తగ్గించడంలో (weight loss) ఏమాత్రం సహాయపడదు. యాపిల్ సిడార్‌ వెనిగర్.. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అయితే అది బాడీ మాస్ ఇండెక్స్‌ని మార్చదు. వాస్తవానికి ఈ డ్రింక్ తరచుగా తాగడం వల్ల ఎసిడిటీ (acidity), అజీర్తి సమస్యలు, నోటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది లాక్సిటివ్స్, ఇన్సులిన్ వంటి ఇతర మందులతో కూడా రియాక్ట్ అవుతుందనేది గమనించాలి.

First published:

Tags: Ginger, Green tea, Weight loss

ఉత్తమ కథలు