Hair fall: తడి జుట్టుకు టవల్​ చుడుతున్నారా? అయితే జుట్టు రాలడం ఖాయం.. జాగ్రత్త పడండి

ప్రతీకాత్మక చిత్రం

స్నానం తరువాత ముఖ్యంగా స్త్రీలలో (women) జుట్టు ఆరుటకు టవల్ (towel) ను చుట్టూ కుంటారు. దీని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఈ అలవాటు (habit)ను ఇలానే కొనసాగించటం వలన భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

  • Share this:
    చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు (hair) పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం(hair loss) జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్య (hair loss problems) ను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. స్నానం తరువాత ముఖ్యంగా స్త్రీలలో (women) జుట్టు ఆరుటకు టవల్ (towel) ను చుట్టూ కుంటారు. దీని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఈ అలవాటు (habit)ను ఇలానే కొనసాగించటం వలన భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే, ప్రతిసారి కఠినమైన నిర్మాణాన్ని కలిగి ఉండే ఫైబ్రిక్ లేదా టెర్రీ టవల్ ను వాడటం వలన జుట్టు ఆరోగ్యం దెబ్బతిని వెంట్రుకల (hairs) కొనలు తెగటం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

    తడి జుట్టుతోనే సమస్య..

    పొడిగా ఉండే జుట్టు కన్నా, తడి జుట్టు (wet hair) ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే నీటిలో నానిన జుట్టు, స్థితిస్తాపకతను కలిగి ఉండి, తెగిపోవటానికి సులువుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కఠినంగా, పొడిగా ఉండే టవల్ లేదా టెర్రీ టవల్ తో జుట్టు లాగటం వలన మృదువుగా ఉండే వెంట్రుకల బయటి పొర దెబ్బతిని జుట్టు రాలిపోతుంది.

    మైక్రోఫైబర్ టవల్ బెటర్​..

    కఠిన నిర్మాణం గల టవల్ లకు బదులుగా నీటిని గ్రహించే టవల్ లేదా మైక్రోఫైబర్ టవల్ (micro fiber towel) లను వాడండి. ఈ మైక్రోఫైబర్ టవల్ లు కృత్రిమ ఫైబర్ ల నుంచి తయారు చేస్తారు. ఇవి నీటిని త్వరగా జుట్టు నుంచి లాగివేస్తాయి. ఇలా తడి జుట్టు నుంచి నీరు వేరు చేయటం వలన కొద్ది సమయంలోనే గాలికి జుట్టు ఆరుతుంది. లేదా మీ జుట్టును గాలి సహాయంతో ఆరబెట్టాడానికి ముందు మృదువైన T-షర్ట్ (T shirt) తో తుడవండి.

    హెయిర్ డ్రయర్​తోనూ ఇబ్బందే..

    జుట్టును ఆరబెట్టే ఉత్తమ పద్దతి ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. అదే సహజంగా గాలి ద్వారా ఆరబెట్టడం. కొంత మంది జుట్టును ఆరబెట్టడానికి కృత్రిమ హెయిర్ డ్రయర్ లను వాడతారు. వీటి వలన జుట్టు ఆరోగ్యం (hair health) ప్రమాదానికే గురవుతుంది తప్ప వేరే ప్రయోజనం ఉండదు. స్నానం చేసిన తరువాత, మృదువుగా ఉండే టవల్ లేదా T-షర్ట్ ను జుట్టుపై కప్పండి, ఇలానే కొద్ది సమయం పాటూ ఉంచటం వలన సహజంగానే జుట్టు ఆరిపోతుంది. కానీ, ఈ పద్దతికి అనుసరించుటకు ఎక్కువ సమయం పట్టినప్పటికీ, తడి జుట్టుతో బయటకు వెళ్ళటం వలన వేసుకున్న బట్టలు లేదా ఇతర ముఖ్యమైన శరీర ప్రదేశాలు తడిసి ఇబ్బందులు ఎదుర్కోవటం కన్నా ఇలా సహజంగా ఆరబెట్టడటం ఉత్తమం.
    Published by:Prabhakar Vaddi
    First published: