అతిబాలా (Atibala). ఇది ఒక కలుపు మొక్క. వేడి ప్రాంతాల్లో ఎక్కువగా ఆ కలుపు మొక్క (plant) పెరుగుతుంది. ఆకులు గుండె ఆకారంలో, పసుపు పూలతో ఎత్తుగా ఉంటుంది. మాల్వేసి కుటుంబానికి చెందిన ఔషధ మొక్కను సంప్రదాయ వైద్య విధానంలో ఉపయోగిస్తారు. ఈ మొక్కలు వేర్లు, ఆకులు (leaf), పువ్వులు (flowers), బెరడు, విత్తనాలు (seeds) , కాండం వంటి వివిధ భాగాలు అన్నీ ఉపయోగించబడతాయి. ఈ మొక్క (plant)లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హైపెర్లిపిడెమిక్, మలేరియా నిరోధక గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అతిబలాను కొన్ని ప్రాంతాల్లో ఊరం (uram), ముద్రగడ, దువ్వెన బెండ, తురబే,, ఉరుమ్ (urum), తుత్తురు బెండ, దువ్వెన కాయ (duvvena kaya)లు అని కూడా అంటారు. అయితే ఈ మొక్కతో మగవారి (men)లో ఉండే శీఘ్ర స్కలనం సమస్యను తొలగించొచ్చట. అంతేకాందు శ్వాస సంబంధ సమస్యలూ (breath problems) తొలగించుకోవచ్చంట. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం..
దగ్గు నుంచి ఉపశమనం..
దువ్వెన కాయలు ఆకులు (leaf) మృదువుగా జిగటగా ఉంటాయి. శరీరంలోని మలినాలను బయటకు పంపి శుద్ధి చేస్తుంది. జ్వరం (fever)తో బాధపడేవారు దువ్వెన కాయలు ( ముద్రబెండ ) ఆకులను నీటిలో నానబెట్టి వడపోసి అందులొ కొద్దిగా కండ చెక్కర కలిపి కొద్ది కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఇదే నీరు మూడు పూటలా తాగితే మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయం వాపు , దీర్ఘకాలిక దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
శీఘ్ర స్కలనం సమస్యకు చెక్..
ఈ చెట్టు మొత్తాన్ని కాల్చి బూడిద చేసి రెండు రెట్ల నీళ్లలో నానబెట్టి మూడు రోజుల పాటు అలా ఉంచాలి. రోజు ఒకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. మూడవ రోజు పైన తేలిన నీటిని మాత్రమే తీసుకొని ఎగిరిపోయే అంతవరకు మరిగించాలి. గిన్నెలో మిగిలిన బూడిద (ass)ను మెత్తగా నూరి దీనిని రోజు అరచెంచా మోతాదులో తీసుకుంటూ ఉంటే శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు (breath problems) తగ్గిపోతాయి. శీఘ్ర స్కలనం సమస్య ఉన్నవారు 100 గ్రాముల ఆకుల పొడి 100 గ్రాముల పట్టిక శతావరి పొడి 100 గ్రాములు మొత్తం మిక్స్ చేసి పాలతో తీసుకోవడం వలన పురుషుల (men)లో శీఘ్రస్కలనం సమస్య తగ్గుతుంది
అతిబలా ఆకులను (athibala leaf) కూరలా వండి రెండు పుతలా తింటూ (eat) ఉంటే మొలల నుండి కారే రక్తం ఆగిపొతుంది. అతిబలా వేరుని నిలువ చేసుకొని రోజు రెండు పూటలా కొంచం నీటితో సానరాయి పైన ఆ వేరుని అరగదీసి ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల (breast) వాపు తగ్గిపొతుంది. అతిబలా వేర్లను దంచి పొడి చేసి జల్లించి నిలవచేసి , ఆ పొడిని మూడు, నాలుగు చిటికెల మొతాదుగా ఆవు (cow) నెయ్యితో కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే గుండెకి బలం కలగడమే కాకుండా ముఖం కాంతి వంతంగా అవుతుంది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
ఇవి కూడా చదవండి: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Life Style, Oxygen plant, Sexual Wellness