Health tips: ఈ ఆకుకూరతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. ఎముకలకు బలాన్ని కూడా ఇస్తాయి.. అదేంటో  తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

కొత్త కొత్త వంటకాలు వస్తున్నాయి. అయితే ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామో.. మన ఆయుష్షు రేటు అంతలా దిగజారిపోతోంది. పూర్వకాలంలోని వాళ్లు వందేళ్లు పైబడి బతికేస్తుంటే.. మనం మాత్రం 60 ఏళ్లు.. 70 ఏళ్ల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాం. అప్పటి ఆహారపు అలవాట్లు (food habits) అలా ఉండేవి మరి. అయితే ఈరోజు పల్లెటూర్లలో ఎక్కడబడితే అక్కడ కనిపించే గంగవాయిల కూర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి.. తెలుసుకుందాం.

  • Share this:
    అప్పట్లో సహజమైన ఆకుకూరల (asparagus)ను, కూరగాయలను తిని ఎంతో ఆరోగ్యంగా జీవించారు. ఇపుడైతే ఆహారపు అలవాట్లు మారిపోయాయి. కొత్త కొత్త వంటకాలు వస్తున్నాయి. అయితే ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామో.. మన ఆయుష్షు రేటు అంతలా దిగజారిపోతోంది. పూర్వకాలంలోని వాళ్లు వందేళ్లు పైబడి బతికేస్తుంటే.. మనం మాత్రం 60 ఏళ్లు.. 70 ఏళ్ల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాం. అప్పటి ఆహారపు అలవాట్లు (food habits) అలా ఉండేవి మరి. అయితే ఈరోజు పల్లెటూర్లలో ఎక్కడబడితే అక్కడ కనిపించే గంగవాయిల కూర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి.. తెలుసుకుందాం.  గంగవాయిల (గంగవెల్లి) ఆకు కూర (asparagus) అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అందుకే ఆయుర్వేదంతో కొన్ని వ్యాధుల చికిత్స కోసం ఈ మొక్కను  ఉపయోగిస్తున్నారు.

    క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని  తగ్గిస్తుంది..

    గంగవాయిల (gangavelli) కూరలో ఎక్కువగా బీటా కెరోటిన్‌ అనేది ఉంది. దీని కాండం ఇంకా ఆకుల ఎర్రటి రంగుకు కారణమైన వర్ణ ద్రవ్యం. ఇక ఈ ఆకులలో కనిపించే అనేక యాంటీ ఆక్సిడెంట్లలో బీటా కెరోటిన్ కూడా ఒకటని చెప్పాలి. ఇక ఈ యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్యను వెంటనే తగ్గిస్తాయని అనేక పరిశోధనలో తెలిపాయి. ఇక ఈ ప్రీ రాడికల్స్ సెల్యులార్ డ్యామేజ్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అందువల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని  తగ్గిస్తుంది.

    అలాగే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో గంగవెల్లి (ganga velli) కూడా చాలా ముఖ్యమైంది. అందుకే ఇది గుండెని కూడా చాలా భద్రంగా కాపాడుతుంది.  ఇంకా ఇది ధమనులు ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తుంది. ఇక అంతేకాదు హార్ట్ ఎటాక్ ఇంకా ఇతర గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

    ఎముకలకు అవసరమైన కాల్షియం ఇంకా మెగ్నీషియం అనేవి కూడా ఈ మొక్కలో ఎక్కువగా ఉంటాయి. అందువలన ఎముకలు బాగా బలహీనపడి అలాగే వచ్చే బోలు ఎముకల (bones) వ్యాధిని కూడా త్వరగా నివారిస్తుంది. ఇక అంతేకాదు ఈ ఆకూ కూరను ఎక్కువగా తీసుకోవడం వలన ఎముకలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.  అలాగే బోలు ఎముకల వ్యాధి తో పాటు వృద్ధాప్యం తో వచ్చే ఎముకల సమస్యల (bones problems)ను కూడా ఇది వెంటనే నివారిస్తుంది.

    విటమిన్ సి అనేది మన శరీరంలోని కొల్లాజెన్ ఇంకా అలాగే రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచడానికి ఇంకా అలాగే గాయాలను కూడా త్వరగా నయం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ మొక్కలో విటమిన్లు (vitamins) అలాగే ఖనిజాలు ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉన్న విటమిన్ ఏ  కళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి చాలా తోడ్పడుతుంది. ఇక అంతేకాదు ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా అలాగే ఆరోగ్యకరమైన కణ విభజనకు కూడా మద్దతు అనేది ఇస్తుంది
    Published by:Prabhakar Vaddi
    First published: