Home /News /life-style /

Digestive problem: జీర్ణ సమస్యలను దూరం చేయడానికి ఈ ఆహారం తీసుకుంటే చెక్​ పెట్టినట్లే..

Digestive problem: జీర్ణ సమస్యలను దూరం చేయడానికి ఈ ఆహారం తీసుకుంటే చెక్​ పెట్టినట్లే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ఎన్నో అనారోగ్యాల పాలవుతారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి జేబులు గుల్ల చేసుకుంటారు. మళ్లీ అదే జీవితంలోకి అడుగుపెడుతారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.

ఇంకా చదవండి ...
    ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం కాపాడుకోవడమే గగనంలా మారిపోయింది. పని, ఆందోళన, కష్టాలు మన తిండి సమయాలనూ మార్చేస్తాయి. ఏ పూట తింటారో తెలియదు. ఏ సమయాల్లో తింటారో తెలియదు. అందుకే చాలామందికి జీర్ణ సమస్యలు(digestive problems) వస్తాయి. ఎన్నో అనారోగ్యాల పాలవుతారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి జేబులు గుల్ల చేసుకుంటారు. మళ్లీ అదే జీవితంలోకి అడుగుపెడుతారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సమస్యలు (digestive problems) తెచ్చుకోకూడదు. పోషకాలు బాగా ఉండే ఆహారం(food) తినండి. పుష్కలంగా నీరు తాగండి(drink). అయితే జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి కావలసిన కొన్ని ఆహార పదార్థాలు విరివిగానే లభిస్తాయి. అవి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతాయి. అందులో మొదటిది పెరుగు(curd), రెండోది అల్లం టీ(ginger tea). ఈ రెండే కాకుండా చాలా పదార్థాలు జీర్ణక్రియ(digestive system) సరిగా అవడానికి దోహదపడుతాయి. ఇపుడు ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.. అనారోగ్యాన్ని(unhealthy) దూరం చేసుకుందాం.

    మీకు ఉదర సమస్య ఉంటే పెరుగన్నం తినవచ్చు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. మీరు అన్నాన్ని(rice) కొంచెం ఎక్కువగా ఉడికించి పెరుగు(curd)తో బాగా కలపాలి. దానికి కొద్దిగా ఉప్పు, వేయించిన జీలకర్ర కలపాలి. ఇది తినడానికి రుచికరమైనది మాత్రమే కాదు ఖాళీ కడుపు(empty stomach)తో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి ఇవి గట్‌లో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి.

    మీకు కడుపు నొప్పి, అజీర్ణం ఉంటే అల్లం టీ(ginger tea) తాగండి. అల్లం టీ తాగడం ద్వారా మీరు ఉపశమనం పొందవచ్చు. దీని కోసం ఒక కప్పు నీటిలో కొన్ని తురిమిన అల్లం వేసి మరిగించి రుచికి అనుగుణంగా ఉప్పు, తేనె వేసి టీని ఫిల్టర్ చేయాలి. అల్లం టీ మీ కడుపు చికాకు, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కడుపు సమస్యలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

    తులసిని టీ లేదా కషాయంతో కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి, కాలానుగుణ ఇన్ఫెక్షన్లలో కూడా ఉపశమనం లభిస్తుంది. ఆహారంలో తులసి రసం, ఆకులను చేర్చడం ద్వారా, వ్యాధులు దూరంగా ఉంటాయి
    అరటిపండులో సహజ యాంటాసిడ్ ఉంటుంది. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. అరటిపండు మీ శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఓట్స్ ఒక రుచికరమైన ఇంకా తేలికపాటి ఆహారం. దీనిని ఖాళీ కడుపుతో తినవచ్చు. సాల్టెడ్ ఓట్స్‌లో ఎలాంటి మసాలా దినుసులను కలుపవద్దు. ఇది ఉదర సమస్యలను మరింత పెంచుతుంది. స్వీట్ ఓట్స్ పాలలో వండుతారు. దానిని నీటిలో కూడా ఉడికించవచ్చు. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది.

    మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం వంటివి చాలా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అధికబరువుతో బాధపడేవారు రోజూ మెంతులు నానబెట్టిన నీటిని తీసుకోవాలి. దీనివల్ల సమస్య అదుపులో ఉండడమే కాక.. అదనపు లాభాలుంటాయి. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. కడుపులో ఆమ్లత్వం ఉంటే, ప్రతిరోజూ రెండు నుండి మూడు తులసి ఆకులను నమలండి. కొబ్బరినీళ్లు తులసి ఆకులు , నిమ్మరసం కలిపి తాగితే కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Curd, Ginger, Health benefits, Health Tips, Life Style, Unhealthy

    తదుపరి వార్తలు