హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beauty tips: కుంకుమ పువ్వుతోనూ మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.. ఎలాగంటారా?

Beauty tips: కుంకుమ పువ్వుతోనూ మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.. ఎలాగంటారా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ( Soft skin ) ఉంచుకుంటే మంచిది. పెరుగుతున్న కాలుష్యానికి చర్మం అంద విహీనంగా తయారవుతోంది.. దుమ్ము,ధూళి,ఎండ కారణంగా చర్మం సహజంగా  తేమను కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది..  సహజసిద్దంగా మీ చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుకోవడమెలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం. కావల్సిందల్లా కుంకుమ పువ్వు(Saffron flower).  

ఇంకా చదవండి ...

  చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం(skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ ( External skin care ) చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో..  చర్మం సంరక్షణ ( Skin protection ) అనేది చాలా కీలకం. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం  ( Skin ) పొడి బారి..దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ( Soft skin ) ఉంచుకుంటే మంచిది. పెరుగుతున్న కాలుష్యానికి చర్మం అంద విహీనంగా తయారవుతోంది.. దుమ్ము,ధూళి,ఎండ కారణంగా చర్మం సహజంగా  తేమను కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది..  సహజసిద్దంగా మీ చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుకోవడమెలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం. కావల్సిందల్లా కుంకుమ పువ్వు(Saffron flower).

  అందానికి కూడా..

  కుంకుమ పువ్వు (Saffron flower). మహిళలు గర్భవతులుగా ఉన్న సమయంలో ఎక్కువగా కుంకుమపువ్వును, పాలల్లో కలిపి తీసుకోమని చెప్తూ ఉంటారు.. ఎందుకంటే కుంకుమపువ్వు వల్ల పుట్టబోయే బిడ్డ కూడా ఎంతో అందంగా పుడతారు అన్న ఒక కారణం చేత కుంకుమపువ్వు తినాలి అని చెప్తారు.. అయితే కేవలం కుంకుమపువ్వు వారికి మాత్రమే కాకుండా ఎలాంటి వారైనా అందం (beauty) కోసం ఉపయోగించుకోవచ్చు..

  పెరుగుతో కలిపి..

  పాల నురుగు లాంటి మేని ఛాయ మన సొంతం చేసుకోవడానికి, ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పదార్థం కుంకుమపువ్వు.. ఈ కుంకుమ పువ్వు ను ఎలా ఉపయోగించాలి అంటే.. ఒక అర కప్పు పెరుగు (curd), అర టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు, ఒక టేబుల్ స్పూన్ తేనె (honey) అన్నీ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి.. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి (skin) పై పూతగా పూసి, 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటి (cool water)తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.. పెరుగు, తేనె (honey) చర్మానికి తగినంత తేమను అందించడంతో పాటు, చర్మం తేమను కోల్పోకుండా చేస్తాయి. అంతేకాక  ముఖం మీద ఏర్పడిన మచ్చలు, మొటిమలు కూడా తొలగిపోతాయి.

  ఇక కుంకుమపువ్వు మేని ఛాయను మెరుగు పరిచి మిల్క్ బ్యూటీ (milk beauty) లా కనిపించేలా చేస్తుంది.. సో మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ చిన్న చిట్కాలు (tips) పాటించి మీరు కూడా అందమైన అమ్మాయిలు గా మారిపోవడానికి ప్రయత్నం చేయండి.. ఇక ఈ పద్ధతులు కనక మీరు పాటించినట్లయితే మిమ్మల్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు.. అందులో ఎలాంటి సందేహం లేదు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Beauty tips, Curd, Face mask

  ఉత్తమ కథలు