DID YOU KNOW THAT PAPAYA CAN REDUCE WRINKLES ON THE FACE LETS FIND OUT THE DETAILS PRV
Beauty tips: బొప్పాయితో ముఖంపై ముడతలకూ చెక్ పెట్టొచ్చంట.. వివరాలు తెలుసుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం
బిజీ లైఫ్‌లో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించే సమయమే లేకుండా పోతుంది. దీంతో చిన్న వయసులోనే ముఖంపై(face) ముడతలు వస్తున్నాయి. ముడతలు పడే చర్మం కోసం మీరు ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్(face pack)లను ఉపయోగించవచ్చు.
ఆధునిక యుగం. టెక్నాలజీ పెరిగిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యానికి(health) కూడా సమయం కేటాయించలేని పరిస్థితి. సరైన సమయానికి ఆహారం(food) తినక అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలలో నివసించే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ బిజీ లైఫ్‌లో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించే సమయమే లేకుండా పోతుంది. దీంతో చిన్న వయసులోనే ముఖంపై(face) ముడతలు(wrinkles) వస్తున్నాయి. ముడతలు పడే చర్మం కోసం మీరు ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్(face pack)లను ఉపయోగించవచ్చు. పాలు, తేనె, పిండి, పసుపు మొదలైనవి కాకుండా మీరు పండ్ల నుంచి తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను ట్రై చేయాలి. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను వదిలించడానికి సహాయపడుతుంది. అందులో ముఖ్యమైనది బొప్పాయి(papaya) ఫేస్ ప్యాక్. దీనితో ముఖంలో ముడతలు తగ్గించుకోవచ్చు.
ముడతలతో(wrinkles) వయసు పైబడిన వారిలా కనిపిస్తే… పిగ్మెంటేషన్ మచ్చలతో ముఖమంతా అంద హీనంగా మారుతుందని వ్యాయామ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని టిప్స్(tips) పాటించినా.. ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.. బొప్పాయిలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. కొద్దిగా పండిన బొప్పాయిని ఒక గిన్నెలో వేసి ఇందులో అర టీ స్పూన్ బాదం నూనెను మిక్స్ చేసి పొడి చర్మంపై అప్లై చేయండి. మాయిశ్చరైజేషన్ కోసం 10-15 నిమిషాల తర్వాత కడిగేయండి. పిగ్మెంటేషన్ తగ్గించడానికి పండిన బొప్పాయికి నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. దీన్ని చర్మానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడగాలి. బొప్పాయి స్క్రబ్ చేయడానికి పండిన బొప్పాయి, పెరుగు(curd), కొన్ని చుక్కల నిమ్మరసం(lemon) కలపండి. చర్మంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 5-10 నిమిషాల తర్వాత మఖాన్ని కడిగేయండి. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పుచ్చకాయతో కూడా ముఖంలో ముడతలు తొలగించవచ్చు.
పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ మీ చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తుంది. మీ చర్మాన్ని(skin) మెరిసేలా చేయడానికి ఒక గిన్నెలో సమాన పరిమాణంలో పుచ్చకాయ రసం, తేనె లేదా పచ్చి పాలు తీసుకోండి. వీటిని బాగా కలిపి మీ ముఖం, మెడపై అప్లై చేసి 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. నిమ్మరసంతో పాటు పుచ్చకాయ రసాన్ని ఉపయోగించి ఎక్స్‌ఫోలియేటింగ్ మాస్క్ తయారు చేయండి. మీ చర్మం(skin)పై సమానంగా అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. మీ చర్మాన్ని మెరుగుపరచడానికి, పుచ్చకాయ, దోసకాయ గుజ్జును సమాన పరిమాణంలో తీసుకోవడం ద్వారా మాస్క్ తయారు చేసుకోండి. చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా కొద్దిరోజులు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.