Sleep tips: నిద్రపోయే ముందు బోర్లా పడుకుంటున్నారా? అయితే జాగ్రత్త మీకు ఈ సమస్యలు వచ్చే అవకాశం..

ప్రతీకాత్మక చిత్రం

పడుకునే యాంగిల్​ (Angle) లో కూడా మనం సమస్యలు (Problems) ఎదుర్కోవచ్చంట. సరిగా నిద్ర పోకపోతే తెల్లవారు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చంట. అందులో మొదటిది బోర్లా పడుకునే అలవాటు. అయితే ఇలా పొట్టవైపునకు (stomach side) తిరిగి పడుకోవడం చాలా ప్రమాదమంట  (dangerous). దాని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతోందని పలువురు వైద్య నిపుణులు (Experts) చెబుతున్నారు.

  • Share this:
    నిద్ర (Sleep) ప్రతి ఒక్కరికీ అవసరం. ముందురోజు సరిగా నిద్రపోతేనే మనిషి యాక్టీవ్​గా ఉండగలడు. పని సరిగా చేయగలరు. ఒకవేళ నిద్ర తక్కువైతే అనారోగ్య (Unhealthy) సమస్యలకూ దారితీస్తుంది. అందుకే పడుకునే ముందు మంచి ఆహారం (food) తీసుకోవాలని వైద్యులు చెబుతారు. అయితే పడుకునే యాంగిల్​ (Angle) లో కూడా మనం సమస్యలు (Problems) ఎదుర్కోవచ్చంట. సరిగా నిద్ర పోకపోతే తెల్లవారు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చంట. అందులో మొదటిది బోర్లా పడుకునే (lying down before bed)  అలవాటు. అయితే ఇలా పొట్టవైపునకు (stomach side) తిరిగి పడుకోవడం చాలా ప్రమాదమంట  (dangerous). దాని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతోందని పలువురు వైద్య నిపుణులు (Experts) చెబుతున్నారు. ఇంతకీ ఏంటా ప్రమాదం. అంటే బోర్లా పడుకోవడం అంటే మనం మన పొట్ట మీద భారం వేసి పడుకుంటున్నాం అన్నమాట. దీని వల్ల పలు స్పల్పకాలిక, దీర్షకాలిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయట. ఇలా చేయడం మంచిది కాదని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై కొంచెం వివరంగా తెలుసుకుందాం..

    రోజూ మనం బోర్లా పడుకుని (lying down before bed) నిద్రపోతున్నప్పుడు వెన్నెముక (Spine) తన సహజ వక్రతను కోల్పోతుందట. దీని వల్ల ఒత్తిడి (Stress) పెరిగి వెన్నెముక అధిక శ్రమకు గురవుతుందంటున్నారు. వెనుక కండరాలు కూడా దెబ్బతిని ఉదయాన్నే వెన్నునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. పొట్టవైపునకు తిరిగి పడుకోవడం వల్ల హైపర్లార్డాసిస్ వంటివి మొదలై వెన్ను చివర్లో నొప్పులు మొదలవుతాయట. పొట్టవైపుకు తిరిగి పడుకున్నప్పుడు మనం ఊపిరి (breath) తీసుకోవాడానికి మెడను ఏదో ఒకవైపుకు తిప్పి ఉంచుతాం. దీని వల్ల మన మెడ (Neck), వెన్నెముక (Spine) మధ్య సంబంధాలు చెడిపోతాయట. మెడ ఒకపక్కకు తిప్పి ఉంచడం వల్ల ఒకవైపు గట్టిపడి.. మరో వైపు బలహీనమవుతుందట. దీని వల్ల మెడ పట్టుకోవడం.. మెడ నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయట.

    బోర్లా పడుకోవడం వలన నడుంని వెనక్కి తిప్పి ఉంచుతాం కాబట్టి, లాంబర్డో పాయింట్ మీద వెయిట్ పడుతుంది. ఫలితంగా వెన్ను చివరి భాగంలో వంపుపై భారం పడి నొప్పి (Pain) పెరుగుతుంది. ఫలితంగా మున్ముందు డిస్క్ సమస్యలు కూడా రావొచ్చు. బోర్లా పడుకున్నప్పుడు వచ్చే సమస్యల్లో హెర్నియా డిస్క్ సమస్య మరొకటి. వెన్నెముకలో పగుళ్లు ఏర్పడి జిగురు తగ్గిపోవచ్చు. పొట్ట వైపుకు తిరిగి పడుకునే ముందు మీ తల, మెడ భాగాలపై ఒత్తిడి పడకుండా ఉండేలా ఓ దిండును ఏర్పరుచుకోండి. మీ కాళ్ల కింద కూడా ఓ దిండు ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల  వెన్నెముక సమస్యలు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయట.
    Published by:Prabhakar Vaddi
    First published: