Home /News /life-style /

DID YOU KNOW THAT IF YOU WANT TO REDUCE KIDNEY STONES IN YOUR BODY IT IS BETTER TO TAKE THIS JUICE REGULARLY PRV

Stones in kidney: కిడ్నీలో రాళ్లు తగ్గాలంటే ఈ జ్యూస్​ రెగ్యులర్​గా తీసుకుంటే బెటర్​.. ఇంతకీ ఆ జ్యూస్​ ఏమిటంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కిడ్నీలో రాళ్లు (stones in kidneys). ఈ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. మారిన జీవన శైలి, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, స్ధూలకాయం లాంటివి ప్రధాన కారణాలు. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ (kidney stones) అంటారు. అయితే మనం మంచి ఆహారం తీసుకుంటే వీటిని కరిగించుకోవచ్చు.

ఇంకా చదవండి ...
    కిడ్నీ (Kidneys)లు మానవుని మనుగడకు చాలా ముఖ్యమైన అవయవాలు. శరీరంలో పాడయ్యే అవయవాల్లో (body parts) ఈ కిడ్నీలే ఎక్కువ. ఆసుపత్రులతో బాధితులు కోకొల్లలు. ఇదే అదునుగా చేసుకుని కేటుగాళ్లు అక్రమ వ్యాపారం చేస్తారు. మరికొందరైతే ఆసుపత్రుల్లో కిడ్నీలు దొంగిలించిన సందర్భాలూ ఉన్నాయి. మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఇలాంటి సమస్యలు ఉత్సన్నమవవు. మంచి ఆహారం (good food) తీసుకుంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా (healthy) ఉంటాయి. అయితే మారుతున్న జీవన పరిస్థితుల కారణంగా ఆహారం కల్తీ అయిపోయింది. ఏది మంచి ఆహారం ఏది కాదో తిని ఆసుపత్రిలో పడే అంతవరకు తెలియట్లేదు. ఆ తర్వాత రోగాలు (diseases) వచ్చాయని, తెలుస్తోంది. అందులో ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు (stones in kidneys). ఈ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. మారిన జీవన శైలి, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, స్ధూలకాయం లాంటివి ప్రధాన కారణాలు. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ (kidney stones) అంటారు. అయితే మనం మంచి ఆహారం తీసుకుంటే వీటిని కరిగించుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం..

    ఇవి చాలా రకాలు..

    ఈ కిడ్నీ రాళ్లలో చాలా రకాలు ఉన్నాయి, స్ట్రువిట్ స్టోన్ అనేది మూత్రనాళా ఇన్ఫెక్షన్ను కలుగచేస్తుంది. యూరిక్ యాసిడ్ స్టోన్ అనేది ద్రవరూప పానీయాలను అస్సలు తీసుకోకపోయినా, ఎక్కువగా తీసుకున్నా వారిలో వస్తుంది. చాలామందికి ఏర్పడే కిడ్నీ రాళ్లలో ఎక్కువగా కాల్షియం స్టోన్స్ మాత్రమే ఏర్పడతాయి. ఇది సాధారణంగా కాల్షియం ఆక్సలేట్ రూపంలో ఉంటాయి. ఈ ఆక్సలేట్ అనేది సహజంగా తీసుకొనే ఆహార పదార్థాల సమ్మేళనాల ద్వారా కాలేయ సహాయంతో రోజువారీగా తయారవుతుంది.

    కొత్తిమీర..

    కొత్తిమీర (Coriander) ఆరోగ్యానికి (healthy) చాలా మంచిదని అందరికి తెలిసిందే. ఒక కూర ఏదైనా కాని బాగా రుచిగా ఉండాలంటే ఖచ్చితంగా కొత్తిమీర కావాలి. కొత్తిమీర తో వచ్చే రుచి (tasty) అంత బాగుంటుంది. ఇక కొత్తిమీర (Coriander)తో కిడ్నీల్లో రాళ్లను కరిగించుకోవచ్చు. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు. వైద్యుల సలహా తీసుకుని కొత్తిమీర జ్యూస్ ( Coriander juice) తాగడం చాలా మంచిది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో కొత్తిమీర మెరుగ్గా పనిచేస్తుంది.

    కొత్తిమీరతో ఇతర ప్రయోజనాలు..

    చర్మ (skin) రక్షణగా కూడా కొత్తిమీర (Coriander) మంచిదే. స్కిన్ డ్రైనెస్, ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ ఎదుర్కోడానికి కొత్తిమీర ఉపయోగపడుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలను దూరం చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొత్తిమీరలో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు సైతం ఉన్నాయట. కీళ్లనొప్పులు, కాళ్ల నొప్పులతో బాధపడే వృద్ధులు ఈ జ్యూస్ తాగితే మంచిది. కొత్తిమీర జ్యూస్‌ని తాగడం వల్ల శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటికి వెళ్లిపోతుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోటిని శుభ్రంగా ఉంచుతాయట.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Attack stones, Food, Health Tips, Kidney

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు