హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Belly fat: బెల్లీ ఫ్యాట్​తో బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్కటి తినండి.. కొవ్వు తగ్గడం ఖాయం !

Belly fat: బెల్లీ ఫ్యాట్​తో బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్కటి తినండి.. కొవ్వు తగ్గడం ఖాయం !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బెల్లీ ప్యాట్ (Belly fat)​లు ఎక్కువైపోయాయి. దీంతో ఆసుపత్రులకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. డబ్బులు తగలేస్తున్నారు. పొట్ట కింద అధిక కొవ్వు ఉండటం ఆరోగ్యానికి(Health) అంత మంచిది కాదు. ఈ ఒక్క ఆహారం మీ మెనూలో చేర్చుకోండి. దీనితో మీకు ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతి రోజు మీరు సజ్జ రొట్టెలు కనుక తింటే(eat) కచ్చితంగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.

ఇంకా చదవండి ...

  టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు(Eating habits) మారిపోయాయి. సమయాభావం, కల్తీ ఆహారం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. జిమ్​లూ, వ్యాయామాలు(exercise) చేయక శరీరంలో కొవ్వు బాగా పెరిగిపోతుంది. బెల్లీ ప్యాట్ (Belly fat)​లు ఎక్కువైపోయాయి. దీంతో ఆసుపత్రులకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. డబ్బులు తగలేస్తున్నారు. పొట్ట కింద అధిక కొవ్వు ఉండటం ఆరోగ్యానికి(Health) అంత మంచిది కాదు. అయితే బెల్లీ ఫ్యాట్(Belly fat) ఎక్కువగా ఉన్నవాళ్లు.. తగ్గించుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఈ ఒక్క ఆహారం మీ మెనూలో చేర్చుకోండి. దీనితో మీకు ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతి రోజు మీరు సజ్జ రొట్టెలు కనుక తింటే(eat) కచ్చితంగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. సజ్జ పిండిలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. పొట్ట కింద కొవ్వు తగ్గించడానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సజ్జ రొట్టె (Sajjalu or Millet grains)లు డయాబెటిస్ తో బాధపడే వారికి మరింత మంచిది.

  ఎలా తయారు చేసుకోవాలి..

  సజ్జ రొట్టె (Sajja bread)లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక జీర్ణ సమస్యలు(digestive problems) లేకుండా చూసుకుంటుంది. కాబట్టి ప్రతి రోజూ మీరు మీ డైట్(Diet) లో వీటిని తీసుకుంటే ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకో వచ్చు. అయితే మరి సజ్జ రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలి. దానికి కావలసిన పదార్ధాలు(items) చూద్దాం. ముందుగా సజ్జ(millet) పిండి తీసుకొని అందులో వేడి నీళ్ళు వేయండి ఇప్పుడు చపాతి పిండిలా ఒత్తుకోవాలి. మెత్తగా పిండిని మొత్తం కలుపుకోండి. నెక్స్ట్ చపాతీలా ఒత్తుకున్నాక రెండు వైపులా కూడా కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోవాలి. వేడి వేడిగా ఈ రొట్టెలు తింటే బాగుంటుంది. అధిక మొత్తంలో చక్కెరలు, ఉప్పు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటి వల్లనే ప్రమాదకరమైన కొవ్వులు శరీరంలో పోగుపడతాయి.

  పొట్ట, తొడల చూట్టూ పేరుకుపోయే కొవ్వులను(fats) వ్యాయామం ద్వారా అంత సులభంగా కరిగించలేం. తొడ కొవ్వు కంటే, బెల్లీ ఫ్యాట్ను కరిగించడం చాలా కష్టమని వైద్యులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్లో(belly fat) కొవ్వు కణాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇవి అంత సులభంగా విచ్ఛిన్నం కావు. దీన్ని లిపోలిసిస్ అంటారు. మన శరీరంలో ఉండే కొవ్వు కణాలను ఆల్ఫా, బీటా కణాలుగా విభజించవచ్చు. కొవ్వుల విచ్ఛిన్న ప్రక్రియ (fat-breakdown process)కు ఆల్ఫా కణాలు ఎక్కువగా ప్రతిస్పందిస్తాయి. బీటా కణాలు ఇందుకు వ్యతిరేకం.

  కాళ్లు, ముఖం, చేతులు వంటి ప్రాంతాల్లో ఆల్ఫా కొవ్వు కణాలు ఉంటాయి. పొట్ట చుట్టూ ఉండే బెల్లీ ఫ్యాట్ బీటా కణాలను కలిగి ఉంటుంది. ఇవి సులభంగా విచ్ఛిన్నం కావు. దీంతో ఆ ప్రాంతాల్లో కొవ్వును కరిగించడం కష్టమైన పని. గత పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Belly improve, Exercises, Food, Food Grains, Health food, Health Tips, Weight loss

  ఉత్తమ కథలు