dengue: మనీ ప్లాంట్​తో డెంగీ వచ్చే ప్రమాదం.. జాగ్రత్త పడకపోతే దోమలకు నిలయమే

ప్రతీకాత్మక చిత్రం

మనీ ప్లాంటుకు నిర్వహణ ఖర్చులు మోస్తారుగా ఉంటాయి. ఈ మొక్కలను ఎక్కువగా నగర ప్రజలు పెంచుతుంటారు. ఆఫీసుల్లోనూ కనిపిస్తుంటాయి. అయితే ఈ మనీ ప్లాంట్​ రోగాలూ తెచ్చపెడుతుందట. ఈ మొక్క ఉన్న చోటికి డెంగీ దోమలు (mosquitos) వస్తాయంట.

 • Share this:
  మనీ ప్లాంట్ (పోథోస్) ఇంటికి సంపద, అదృష్టాన్ని తెచ్చిపెడుతుందంటారు. మనీ ప్లాంట్లు(money plants) సహజ వాయు శుద్దగా కూడా పనిచేస్తాయి. విషాన్ని గాలి నుంచి ఫిల్టర్​ చేస్తాయి. మనీ ప్లాంటుకు నిర్వహణ ఖర్చులు మోస్తారుగా ఉంటాయి. ఈ మొక్కలను ఎక్కువగా నగర ప్రజలు పెంచుతుంటారు. ఆఫీసుల్లోనూ కనిపిస్తుంటాయి. అయితే ఈ మనీ ప్లాంట్​ రోగాలూ తెచ్చపెడుతుందట. ఈ మొక్క ఉన్న చోటికి డెంగీ దోమలు (mosquitos) వస్తాయంట. ఇటీవల నమోదైన డెంగీ కేసుల్లో ఎక్కువగా నగరంలోని సంపన్నులు నివసించే ప్రాంతాల నుంచే వచ్చినట్లుగా వైద్యులు చెప్పారు. కాగా, దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే కేవలం హైదరాబాద్​లో(Hyderabad)నే అత్యధిక డెంగీ కేసులు నమోదవుతున్నాయట. ఇది కొంత ఆందోళన కలిగించే అంశమైన అసలే పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయాల్లో కొత్తకొత్త వ్యాధులు తెచ్చుకోవడం ఎందుకని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఈ మనీ ప్లాంటు వద్దకే డెంగీ దోమలు ఎందుకు చేరుతున్నాయి.. అసలు ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకుంటే ఆరోగ్యానికి మంచిది అనేది తెలుసుకుందాం..

  నగర ప్రజలు అందం, ఆహ్లాదం కోసం పెంచుతున్న పూల మొక్కలు.. వాటి కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలు ప్రస్తుతం డెంగీ దోమలకు నిలయంగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 537 డెంగీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా లు ఉన్నాయి. సాధారణంగా పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉన్న మూసీ పరీవాహక ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు రావాలి కాని.. సంపన్నులు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌(banjara hills) వంటి ప్రాంతాల్లో నమోదవుతుండటంపై ఆందోళన(stress) వ్యక్తమవుతోంది.  పేద, మధ్య తరగతి(middle class) ప్రజలతో పోలిస్తే సంపన్నుల నివాసాలు విశాలంగా ఉంటాయి. వీరు ఇంటి ఆవరణలో అందం, ఆహ్లాదకర వాతావరణం కోసం మనీ ప్లాంట్లు, రకరకాల పూల మొక్కలు(flower plants) పెంచుకుంటారు. వీటి కోసం భారీ కుండీలను ఏర్పాటు చేస్తుంటారు. వర్షపు నీరు వీటిలో చేరి రోజుల తరబడి నిల్వ ఉంటుంది.  వీటిలో డెంగీ దోమలు గుడ్లు(eggs) పెట్టి వాటి వృద్ధికి కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కాలనీలు, నిర్మాణాలు, సెల్లార్లు ఎక్కువగా ఉన్న శివారు ప్రాంత మున్సిపాలిటీల్లోనూ డెంగీ కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు వారాల్లోనే గాంధీ ఆస్పత్రిలో డెంగీతో 54 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు డెంగీ షాకింగ్‌ సిండ్రోమ్‌తో (బాలిక, బాలుడు) మృతి చెందారు. నిలోఫర్‌ ఆస్పత్రిలో రోజుకు కనీసం 20 నుంచి 30 డెంగీ కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది.

  కాగా, దోమలు ఎక్కువగా నిల్వ ఉండే ప్రదేశాలలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు, మనీప్లాంట్స్, ఇతర చెట్ల పొదలు  టైర్లు, ఖాళీ సీసాలు, కొబ్బరి బోండాలు ఇంటిపై మూతల్లేని నీటి ట్యాంకులు  కొత్త నిర్మాణాలు, సెల్లార్లు తాళం వేసిన నివాసాలు  విద్యా సంస్థలు, ఫంక్షన్‌ హాళ్లు  ముంపు ప్రాంతాల్లో నిల్వ నీరు ఉన్న చోట ఉంటాయి. అందుకే అలాంటి వాటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగీ రాకుండా అరికట్టవచ్చు.
  Published by:Prabhakar Vaddi
  First published: