హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

White Teeth: మీ దంతాలు పసుపు రంగులో ఉన్నాయా? అయితే నారింజ తొక్కతో మీ దంతాలు మెరవడం ఖాయం

White Teeth: మీ దంతాలు పసుపు రంగులో ఉన్నాయా? అయితే నారింజ తొక్కతో మీ దంతాలు మెరవడం ఖాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దంతాలపై పసుపు రంగు పోవాలంటే నిపుణులు(Experts) కొన్ని సూచనలు చేశారు. వాటిని పాటించడం ద్వారా దంతాలు ముత్యాల్లా మెరుస్తాయని(Shine) చెబుతున్నారు. నారింజ తొక్క(Orange peel) కూడా మీ దంతాలపై ఉన్న పసుపు తొలగిస్తుందంటే నమ్మండి. తొక్కే కదా అని తీసిపడేయకండి. నిజంగానే పళ్లకు ఉపయోగపడుతుందట. అంతేనా మరికొన్ని కూడా మీ పసుపు రంగు దంతాలపై ఆ కలర్​ను చెరిపేస్తాయి.. అవేంటో ఓ సారి లుక్కేద్దాం..

ఇంకా చదవండి ...

దంతాలు(Teeth) మనిషికి నవ్వుతో పాటు అందాన్ని(Beauty) కూడా ఇస్తాయి. అయితే చాలా మంది మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వారి దంతాలు పసుపు రంగు(Yellow color)లో ఉండటం. అందుకే చాలా మంది తమ దంతాలను తెల్ల(White)గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే దంతాలు ముత్యాల్లా చేసుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. మీ దంతాలపై పసుపు రంగు పోవాలంటే నిపుణులు(Experts) కొన్ని సూచనలు చేశారు. వాటిని పాటించడం ద్వారా దంతాలు ముత్యాల్లా మెరుస్తాయని(Shine) చెబుతున్నారు. నారింజ తొక్క(Orange peel) కూడా మీ దంతాలపై ఉన్న పసుపు తొలగిస్తుందంటే నమ్మండి. తొక్కే కదా అని తీసిపడేయకండి. నిజంగానే పళ్లకు ఉపయోగపడుతుందట. అంతేనా మరికొన్ని కూడా మీ పసుపు రంగు దంతాలపై ఆ కలర్​ను చెరిపేస్తాయి.. అవేంటో ఓ సారి లుక్కేద్దాం..

పసుపు రంగులోకి ఎలా మారుతాయి..

జంక్ ఫుడ్ వలన ఎదురయ్యే సమస్యలలో ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఒకటి దంతాలు పసుపు రంగులో ఉండటం. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన(Bad smell) కూడా వస్తుంది. మాములుగా నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణం దంతాలపైన డెంటినా అనే పొర తొలగిపోవడమే. కాఫీ, టీ, వైన్ వంటి టానిన్‌లు కలిగిన ఆహారాలు, పానీయాలు మీ దంతాలకు పసుపు రంగు వచ్చేలా చేస్తాయి. ఆమ్లత్వంతో కూడిన ఆహార పదార్థాలు(Food items) కూడా దంతాలను పసుపు రంగులోకి మారుస్తాయి.

నారింజ తొక్కలు మీ దంతాలపై ఉన్న పసుపు రంగును తొలగిస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే. రాత్రిపూట పడుకునే ముందు నారింజ తొక్కతో మీ దంతాలను రుద్దండి. కొన్ని రోజుల అలా చేస్తే మీ దంతాలు శుభ్రంగా తెల్లగా మారుతాయి. అంతేకాకుండా ఈ ప్రక్రియను కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. స్ట్రాబెర్రీని గ్రైండ్​ చేసి ఆ మిశ్రమంతో రోజుకు కనీసం రెండు సార్లు మీ దంతాలను శుభ్రం చేసుకుంటే వాటిపై ఉన్న పసుపు రంగు పోతుంది. తులసీ ఆకులను కూడా వాడొచ్చు. తులసీ ఆకుల పొడిని దంతాలకు వాడితే పసుపు రంగు మటుమాయం అవుతుంది.

తెల్లటి దంతాలు కావాలంటే.. రోజూ సరిగా బ్రష్(brush) చేసుకోవాలి. టూత్‌ పేస్ట్, ఫ్లోసింగ్, మౌత్ వాష్‌(mouth wash)తో నోటిని శుభ్రం చేసుకోవాలి. రోజుకు కనీసం రెండుసార్లు బ్రష్ చేయడం ఇంకా మంచిది. ప్రతీ రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయండి. ఎలక్ట్రిక్, సోనిక్ టూత్ బ్రష్‌లు రెండూ సంప్రదాయ టూత్ బ్రష్‌ల కంటే ఎక్కువగా దంతాలపై ఉన్న పసుపు రంగు మరకలను తొలగించడంలో ఉపకరిస్తాయి.

Read this also : బొప్పాయితో ముఖంపై ముడతలకూ చెక్​ పెట్టొచ్చంట.. వివరాలు తెలుసుకుందాం

దంతాలు శుభ్రంగా ఉండటానికి చక్కెర పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. పాలు, పాల ఉత్పత్తులు, జున్ను, పెరుగు వంటి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. అలాగే.. వాట్ నట్స్, బాదం, పుట్టగొడుగులు, గుడ్లు, చిలకడ దుంపలు, క్యారెట్లు తినండి. దీంతో మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

First published:

Tags: Ayurveda, Health Tips, Orange film, White

ఉత్తమ కథలు