హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Breakfast: అధిక బరువు పెరగడానికి బ్రేక్​ఫాస్ట్​ కూడా ఓ కారణమట.. ఎలాగో తెలుసుకోండి

Breakfast: అధిక బరువు పెరగడానికి బ్రేక్​ఫాస్ట్​ కూడా ఓ కారణమట.. ఎలాగో తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి  క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి. అయితే బ్రేక్​ఫాస్ట్​ కూడా మనం బరువు పెరగడానికి కారణమవుతుందట. అదెలాగంటే..

అధిక బరువు (heavy weight). మనిషికి మన: శాంతిని దూరం చేస్తుంది. వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోకపోవడం తదితర కారణాలు బరువు పెరగడానికి (weight gain) కారణాలవుతాయి. అయితే ఈ అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, కొంతమందికి ఆ సమయం (time) కూడా ఉండదు. బరువు తగ్గడానికి (weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం (food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు (tips) పాటిస్తే బరువు (weight) తగ్గుతారు. అతిగా వ్యాయామాలు చేయడమే. ఎంత చక్కటి వర్కవుటైనా... ఇన్నిసార్లు... ఇంతసేపు చేయాలనే నియమం ఉంటుంది. అలా కాకుండా త్వరగా బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి  క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి. అయితే బ్రేక్​ఫాస్ట్​ కూడా మనం బరువు పెరగడానికి కారణమవుతుందట. అదెలాగంటే..

బ్రేక్ ఫాస్ట్ (breakfast) తినకపోవడం వల్ల క్యాలరీలు తగ్గి బరువు తగ్గుతామని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది అస్సలు నిజం కాదు. నిజానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తిననివారు.. బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారి కంటే వేగంగా బరువు పెరుగుతారట. ఎందుకంటే ఇలా బ్రేక్ ఫాస్ట్ (breakfast) చేయకపోవడం వల్ల శరీర మెటబాలిజం నెమ్మదిస్తుంది. అంతేకాదు.. ఆకలి ఎక్కువగా వేయడం వల్ల.. మధ్యాహ్నం సమయంలో భోజనం ఎక్కువగా తినేస్తారు. ఇది కూడా బరువు పెరగడానికి కారణమే. అందుకే బరువు తగ్గాలనుకునే వారు.. తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది.

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ (breakfast) చేయకపోవడం వల్ల.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ 54 శాతం పెరుగుతుందట. హార్వర్డ్ యూనివర్సిటీ ఓ పరిశోధన నిర్వహించింది. ఇందులో భాగంగా బ్రేక్ ఫాస్ట్ తినే అలవాటు లేని వారిలో.. డయాబెటిస్ (diabetes) వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది.

ఇది కూడా చదవండి: ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్​ పెట్టొచ్చంట.. ఆ మొక్క ఏంటంటే?

అవాంఛిత బరువు పెరగకుండా మీరు శనగ వెన్న(peanut butter)ను ఆరోగ్యకరమైన ఆహారం(food)లో వాడవచ్చు. వేరుశెనగ వెన్న తిన్నవారికి రక్తం (blood)లో చక్కెర స్థాయిలు (sugar levels) ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి. వేరుశెనగ వెన్న వంటి ఆహారాల నుంచి తగినంత ప్రోటీన్ తినడం (eat) వల్ల ఆహారం తీసుకునేటప్పుడు కండరాలను కాపాడుకోవచ్చు. చాలా మంది డైటర్లు వేరుశెనగ వెన్నకు దూరంగా ఉంటారు ఎందుకంటే ఇందులో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ, మితమైన తీసుకోవడం బరువు పెరగడానికి అవకాశం లేదట. మరోవైపు బరువు పెరగడం మీ లక్ష్యం అయితే.. మీరు బర్న్ చేసిన దానికంటే ఎక్కువ కేలరీలు తినాలి.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇదికూడా చదవండి:

గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?

First published:

Tags: Health Tips, Weight gain, Weight loss

ఉత్తమ కథలు