Hair loss: జుట్టులో చుండ్రు అధికంగా ఉందా? అయితే ఈ ‘టీ ’ని మీ జుట్టుకు అప్లై చేసి సమస్యను దూరం చేసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం

ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె(oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు(hair) అందరికీ ఉండేది. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దానివలన తలలో చర్మం పొడిబారి చుండ్రు, జుట్టు రాలే సమస్యలు వస్తాయి. కొన్ని సహజ పద్దతులతో జుట్టుని కాపాడుకోవచ్చు.

  • Share this:
    చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె(oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు(hair) అందరికీ ఉండేది. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దానివలన తలలో చర్మం పొడిబారి చుండ్రు (dandruff), జుట్టు రాలే సమస్యలు వస్తాయి. కొన్ని సహజ పద్దతులతో జుట్టుని కాపాడుకోవచ్చు.

    చామంతి టీ..

    జీవనశైలి మార్పులు, వాతావరణ ప్రభావం కారణంగా నేటి తరం యువతులు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చుండ్రు. చామంతి టీ ( Chamomile tea) చుండ్రు, దాని కారణంగా వచ్చే దురద సమస్యలకు చెక్ పెడుతుంది. హెన్నఫేస్ మాస్క్లో చామంతి టీ కలిపి దాన్ని తలకు అప్లై చేసుకోవాలి. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు (dandruff) సమస్య వదిలిపోతుంది.

    గిన్నెలో నీరు తీసుకొని దాన్ని బాగా వేడి చేయాలి. నీరు వేడెక్కిన తర్వాత కొద్దిగా బెల్లాన్ని జోడించాలి. లేదంటే.. తీపి కోసం చక్కెర, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వంటి వాటిని ఉపయోగించవచ్చు.తర్వాత అందులో కొద్దిగా ఎండబెట్టిన చామంతి పూలను వేయండి. గిన్నె పై మూత పెట్టి రెండు నుంచి పది నిమిషాల పాటు తక్కువ సెగపై మరగనివ్వాలి. మీరు ఎంత స్ట్రాంగ్‌గా కావాలంటే అంత సేపు మరగపెట్టాలి. మీకు నచ్చిన మోతాదులో రంగు, వాసన వచ్చిన తర్వాత వడపోసి నిమ్మరసం (lemon) కలిపి టీ తాగాలి. కావాలనుకొంటే.. తీపి కోసం తేనె కూడా కలుపుకోవచ్చు.

    ఇది కూడా చదవండి: ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్​ పెట్టొచ్చంట.. ఆ మొక్క ఏంటంటే?

    జుట్టు (hair)కు తమకు నచ్చిన రంగులను అద్దుతున్నారు నేటి తరం యువతులు. చామంతి టీ ( Chamomile tea) తో సహజసిద్ధంగా వాటిని మీ కురులకు అందించవచ్చు. బంగారు వర్ణంలో మీ కురులు మెరిసిపోవాలంటే.. తలస్నానం చేసిన తర్వాత కప్పు చామంతి టీతో జుట్టును కడగాలి. బ్రౌన్ రంగు జుట్టు కావాలనుకొంటే.. చామంతి టీతో హెన్నా కలిపి దాన్ని తలకు అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇది కూడా చదవండి:

    గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?
    Published by:Prabhakar Vaddi
    First published: