beauty tips: జుట్టు, కనుబొమ్మలు అందంగా మృదువుగా ఉండాలా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

జుట్టు రాలే సమస్యను అధిగమించడానికి చాలామంది రకరకాల షాంపూలు, హెయిర్‌ మాస్క్‌లు ట్రై చేస్తుంటారు. అయినా ఏం లాభం ఉండదు. ఈ సమస్య పరిష్కారానికి మూలం (hair fall treatment) ఎక్కడుందో తెలుసుకోవాలి. అయితే అందమైన జుట్టు (hairs), కనుబొమ్మల (Eye brows)కు కలబంద చాలా చక్కగా పని చేస్తుంది.

  • Share this:
    జుట్టు అందరికీ అందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మహిళలు (women) కేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో అనేక మందికి ఎదురవుతున్న సమస్య జుట్టు రాలడం. మహిళలు జుట్టు రాలడం (hair fall) భరించలేరు. ఇక పురుషుల్లో అయితే అనేక కారణాల వల్ల నేడు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా జుట్టు రాలడం, రంగు మారడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి చాలామంది రకరకాల షాంపూలు, హెయిర్‌ మాస్క్‌లు ట్రై చేస్తుంటారు. అయినా ఏం లాభం ఉండదు. ఈ సమస్య పరిష్కారానికి మూలం (hair fall treatment) ఎక్కడుందో తెలుసుకోవాలి. అయితే అందమైన జుట్టు (hairs), కనుబొమ్మల (Eye brows)కు కలబంద చాలా చక్కగా పని చేస్తుంది. అలోవేరా జెల్ మన జుట్టుకు మంచి మాయిశ్చరైజింగ్​లా పని చేస్తుంది. ఈ జెల్ ని వాడడం వలన అనేక రకాల జుట్టు సమస్యలను (hair fall problems) దూరం చేసుకోవడమే కాకుండా మంచి అందమైన జుట్టుని పొందవచ్చు. దీన్ని జట్టుకు అప్లై చేసినపుడు మంచి నిగారింపు అనేది వస్తుంది.

    మృదువుగా..

    మీ జుట్టు డ్రై,  రఫ్గా ఉన్నట్లు అయితే అప్పుడు అలోవేరా జెల్ (Aloe vera) ను జుట్టుకు అప్లై చేయడం వలన ఇలాంటి సమస్యలను (problems) చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు. అలోవేరా జెల్ ను జుట్టుకు బాగా మసాజ్ చేసి ఒక 30 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత జుట్టు (hairs)ను బాగా కడుక్కోవాలి. ఇలా జుట్టుని కడుక్కున్న తర్వాత మన జుట్టు చాలా మృదువు గా వుంటుంది.

    కనుబొమ్మలకు..

    జుట్టుకు కలబంద రాసుకునే ముందు తేనె, ఆలివ్ ఆయిల్ ఇంకా పెరుగులను (growth) కూడా అలోవేరా జెల్ కు కలుపుకోని రాసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వలన వెంట్రుకలు కుదుళ్ల నుంచి కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఇక ఈ ద్రావణాన్ని మన జుట్టు మీద అప్లై చేసుకుని ఒక 30 నిమిషాల పాటు మన జుట్టు మీద అలాగే ఉంచుకుంటే చాలా ఒత్తుగా ఉంటుంది. అలాగే మన కనుబొమ్మల (Eye brows)పై కూడా అలోవెరా జెల్ ని ఉపయోగిస్తే ఎంతో అందంగా ఒత్తుగా ఉంటాయి.

    అయితే మీ జుట్టు అకస్మాత్తుగా రాలితే మీరు తినే ఆహారంలో కొన్ని పోషకాలు లేకపోవడమే కారణం. ఆహారపు అలవాట్లు (food habits) సరిచేసుకోవాలి. మనం తీసుకునే ఆహారం (food) వల్ల మనకు అందం(beauty), ఆరోగ్యం రెండూ వస్తాయి. చర్మ సౌందర్యం, జుట్టుకు అవసరమైన పోషకాలను అందించేది ఆహారం.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published: