Home /News /life-style /

DID YOU KNOW THAT ALCOHOL CAN DOUBLE YOUR BEAUTY AND ALSO REDUCE YOUR PAINS PRV

Beauty tips for face: మద్యంతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చంట.. మీ నొప్పులనూ దూరం చేస్తుందట.. ఎలాగంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బిజీ లైఫ్‌లో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించే సమయమే లేకుండా పోతుంది. దీంతో చిన్న వయసులోనే ముఖంపై(face) ముడతలు(wrinkles) వస్తున్నాయి. ఆల్కాహాల్ (Alcohol)​తో మీ అందాన్ని మెరుగు పరచుకోవచ్చంట. వోడ్కా, వైన్ (wine) వంటివి సౌందర్యాన్ని (beauty) ఎలా పెంచుతాయో వివరించారు.

ఇంకా చదవండి ...
  ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యానికి(health) కూడా సమయం కేటాయించలేని పరిస్థితి. సరైన సమయానికి ఆహారం(food) తినక అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలలో నివసించే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ బిజీ లైఫ్‌లో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించే సమయమే లేకుండా పోతుంది. దీంతో చిన్న వయసులోనే ముఖంపై (face) ముడతలు (wrinkles) వస్తున్నాయి. ముడతలు పడే చర్మం కోసం మీరు ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ (face pack)లను ఉపయోగించవచ్చు. పాలు, తేనె, పిండి, పసుపు మొదలైనవి కాకుండా మీరు పండ్ల నుంచి తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను ట్రై చేయాలి. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను వదిలించడానికి సహాయపడుతుంది. అయితే సోషల్​ మీడియాలో కొన్ని చిట్కాలు సర్క్యలేట్​ అవుతున్నాయి. ఆల్కాహాల్ (Alcohol)​తో మీ అందాన్ని మెరుగు పరచుకోవచ్చంట. వోడ్కా, వైన్ (wine) వంటివి సౌందర్యాన్ని (beauty) ఎలా పెంచుతాయో వివరించారు. ఒకసారి దాని గురించి తెలుసుకుందాం..

  బీర్ తో పెడిక్యూర్..

  సగం బాటిల్ బీర్ (beer) ను గోరువెచ్చని నీటిలో కలిపి  కాళ్ళను 20 నిమిషాల పాటూ ముంచండి. బీర్ సహజ యాంటీ సెప్టిక్ వలే పని చేసి, కాలి గోర్లను శుభ్రపరుస్తుంది. దీనితో పాటుగా బీర్ పాదాలను మృదువుగా (smooth) మారుస్తుంది. ఉప్పు, ఆలివ్ ఆయిల్ మరియు కొద్దిగా నిమ్మరసం (lemon juice) కలిపిన మిశ్రమాన్ని చర్మంపై వలయాకారంలో రుద్దండి. ఇది మీ శరీరంపై ఉండే నిర్జీవ కణాలను తొలగించి, చర్మాన్ని మృదువు (smooth skin)గా చేస్తుంది. ఈ మిశ్రమంతో చర్మంపై రుద్దిన తరువాత 5 నిమిషాల పాటూ అలాగే ఉంచి, నీటితో చర్మాన్ని కడగండి. అంతేకాదండోయ్​ ఈ మద్యం (బీర్​)ను పాదాలకు వాడితే నొప్పులు (pains gone) కూడా మటుమాయం అవుతాయంట.

  రెడ్ వైన్ తో ఫేషియల్..

  రెడ్ వైన్ (red wine) యాంటీ ఆక్సిడెంట్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది . ముఖంపై (on face) దీనిని అప్లై చేయటం వలన నల్లటి వలయాలు (dark circles), ముడుతలు తొలగిపోతాయి. అంతేకాకుండా, రెడ్ వైన్ కు కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసి, 10 నుండి 15 నిమిషాల పాటూ ఉంచటం వలన చర్మం (skin) పున: తాజా అవుతుంది..

  జుట్టు మృదువుగా..

  రోజు మన చుట్టూ ఉండే వాతావరణానికి జుట్టు బహిర్గతం అవటం వలన వెంట్రుకలు (hair) పొడిగా, అనారోగ్యానికి గురవుతాయి. ఇలాంటి సమయంలో జుట్టును షాంపూతో కడిగిన తరువాత తేలిక పాటి గాడత గల బీర్ లో ముంచండి. ఇలా చేయటం వలన మీ జుట్టు మృదువుగా మారటమే కాకుండా, తలపై చర్మ ఆరోగ్యం (skin health) కూడా మెరుగుపడుతుంది.

  ఇది కూడా చదవండి: ఆల్కాహాల్​ తాగే సమయంలో ఈ పదార్థాలు అసలే తినొద్దు.. లేదంటే ఆరోగ్య సమస్యలే..

  బాటిల్ షాంపైన్​తో ..

  ఒక బకెట్ నిండా ఉన్న వేడి నీటిలో బాటిల్ షాంపైన్ ను కలిపి, దానిలో 30 నిమిషాల పాటూ మీ జుట్టును అందులో నానబెట్టి తరువాత తొలగించండి.  మంచి ఫలితం వస్తుందట. ఇలా మద్యంతో కూడా మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇవన్నీ ట్రై చేసే ముందు నిపుణుల సలహా తీసుకుంటే బెటర్​. కాకపోతే చివరగా ఒక్కమాట అతిగా మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Alcohol, Beauty, Beauty tips, Hair Loss, Wine

  తదుపరి వార్తలు