Digestive problems: తిన్న తిండి అరగక పోవడానికి నిద్ర లేకపోవడం కూడా ఒక కారణమంట.. ఎందుకంటే

ప్రతీకాత్మక చిత్రం

టాక్సిన్‌లు జీవక్రియతో పాటు మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం కలిగిస్తాయని వివరిస్తున్నారు. అయితే చాలామందికి తిన్న తిండి అరగదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మన నిద్రకు, జీర్ణ వ్యవస్థకు కూడా సంబంధం ఉంటుందట. దాని గురించి తెలుసుకుందాం..

 • Share this:
  బద్దకపు జీవనశైలితో ఎటూ కదలకుండా రోజంతా ఒకే దగ్గర కూర్చొని ఉంటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. కొందరు ఆలస్యంగా పడుకోవడం, జంక్ ఫుడ్ విపరీతంగా ఆరగించడం వంటివి చేస్తుంటారు. అటువంటి వారిలో ఎక్కువగా ఛాతీలో మంట, కడుపునొప్పి (Abdominal pain), మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు (Digestive Problems) వస్తాయి. అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల జీర్ణ విషతుల్యాలు (Digestive Toxins) కూడా పెరిగిపోతాయి. వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఈ టాక్సిన్‌లు జీవక్రియతో పాటు మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం కలిగిస్తాయని వివరిస్తున్నారు. అయితే చాలామందికి తిన్న తిండి అరగదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మన నిద్రకు, జీర్ణ వ్యవస్థకు కూడా సంబంధం ఉంటుందట. దాని గురించి తెలుసుకుందాం..

  నిద్ర తప్పనిసరి..

  జీర్ణ సమస్యలు తగ్గించుకోవాలంటే తియ్యని (sweet) పదార్థాలకు కొంచెం దూరం ఉంటే మంచిది. మన ఆహారంలో షుగర్ పాత్ర ఎక్కువైపోతోంది. తియ్యని పదార్ధం కాకపోయినా కూడా షుగర్ (sugar) ఉంటోంది. సాఫ్ట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లో షుగర్ ఎక్కువగానే ఉంటుంది. వీటిని తగ్గించడం అవసరం. అలాగే, ఆర్టిఫిషియల్ స్వీటెర్నర్స్ కూడా గట్ హెల్త్ కి మంచిది కాదు. శరీరం ఒక బయలాజికల్ క్లాక్ ని ఫాలో అవుతుంది. ఈ క్లాక్ ఇరవై నాలుగు గంటలూ పని చేస్తుంది, అరుగుదల, నిద్ర వంటి వాటిని నియంత్రిస్తూ ఉంటుంది. మీరు సరైన నిద్ర (good sleep) లేకపోతే సరిగ్గా అరగదు. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, కొన్ని జీవన శైలి అలవాట్ల వల్ల నిద్ర (sleep) సరిగ్గా పట్టదు. కాబట్టి ఈ చెయిన్ ని బ్రేక్ చేయాలంటే సరైన ఆహారం తీసుకుని సరిగ్గా నిద్ర పోవడమే పద్ధతి. ఒకే సమయానికి నిద్ర పోయి ఒకే సమయానికి లేవడం, నిద్ర కి గంట ముందు నించే స్క్రీన్ కి దూరంగా ఉండడం వంటి కొన్ని అలవాట్లు హెల్ప్ చేస్తాయి.

  వర్షాకాలంలో..

  వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణం మొత్తం జీర్ణవ్యవస్థను నెమ్మదించేలా (Digestive Problems)  చేస్తుంది. ఈ సీజన్​లో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థకు ఆటకం ఏర్పడుతుంది. ఇది గ్యాస్ట్రో ఎంటెరిటిస్‌కు దారితీస్తుంది. తద్వారా పేగులో ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ (food poising) అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ఈ సీజన్​లోనే చాలామంది రోగులు వాంతులు, వికారం, దీర్ఘకాలిక మలబద్ధకం, పొట్టలో పుండ్లు, గట్ సెన్సిటివిటీ వంటి సమస్యలతో బాధపడుతుంటారు.

  ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే..

  మీ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సరిపోయే నీరు (water) త్రాగండి. పచ్చి కూరగాయలకు బదులుగా ఉడికించిన కూరగాయలను ఎక్కువగా తినండి. రిఫైన్డ్ షుగర్ తినవద్దు. ఎందుకంటే ఇది వాపు, గట్ ఫ్లోరా బ్యాలెన్స్​ను దెబ్బతీస్తుంది. అసిడిటీ, బ్లోటింగ్​కు కారణమయ్యే వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఆహారం తిన్న వెంటనే పడుకోకండి (Don’t sleep after eat). ఒత్తిడి నుంచి బయటపడేందుకు, ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం (exercise) చేయండి.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
  Published by:Prabhakar Vaddi
  First published: