Home /News /life-style /

DID YOU KNOW BRINJALS CAN HELP YOU LOSE WEIGHT CURE ANEMIA HERE THE DETAILS GH SRD

వంకాయల్లో ఇంత విషయం ఉందా..ప్రయోజనాలు తెలుసుకుంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వంకాయ (EGGPlant)వంటి కూరయు.. అంటూ ఆనాటి పద్యాల్లో చెప్పినా.. ఆహా ఏమి రుచి తినరా మైమరచి.. అంటూ ఇప్పటి సినిమాల్లో పాటగా పాడినా వంకాయ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.. గుత్తొంకాయ అంటే ఇష్టం లేని వాళ్లు కనిపించడం చాలా అరుదు. మరి అలాంటి వంకాయ కేవలం రుచిని అందించడమే కాదు.. ఎన్నో పోషకాలను కూడా అందిస్తుందట.

ఇంకా చదవండి ...
వంకాయ (EGGPlant)  వంటి కూరయు.. అంటూ ఆనాటి పద్యాల్లో చెప్పినా.. ఆహా ఏమి రుచి తినరా మైమరచి.. అంటూ ఇప్పటి సినిమాల్లో పాటగా పాడినా వంకాయ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.. గుత్తొంకాయ అంటే ఇష్టం లేని వాళ్లు కనిపించడం చాలా అరుదు. మరి అలాంటి వంకాయ కేవలం రుచిని అందించడమే కాదు.. ఎన్నో పోషకాలను కూడా అందిస్తుందట. ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కూడా దూరంగా ఉంచుతుందట. వంకాయ‌ను మీ భోజ‌నంలో విరివిగా తీసుకోవ‌డం వ‌ల్ల మీ ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన పోషకాలు స‌మృద్దిగా అందుతాయి. ఇది మ‌న‌కు మంచి ఆరోగ్యాన్ని అందించ‌డ‌మే కాదు ఈ మొక్కను మీరు ఇంటి ద‌గ్గ‌ర పెంచుకోగ‌లిగితే, దాని ఆకులు, వేర్లు కూడా మీమ్మ‌ల్ని ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి కాపాడుతాయట. ఇవి మీ గాయాల‌ను మాన్పుతాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచుతాయి. ఇక వంకాయ మొక్క‌లో ఉన్న ఫైటో న్యూట్రియంట్‌లు, పొటాషియం మీ మెద‌డుకు ఆక్సిజ‌న్ సంక్ర‌మంగా అందేట‌ట్లు చూస్తాయి. ఇంకా వంకాయ వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలున్నాయి.. అవేంటంటే..

మెద‌డు ప‌నిత‌నాన్ని చురుకుగా చేస్తుంది
వంకాయలు తరచూ తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు శక్తి పెరుగుతుంది. దీని ద్వారా ల‌భించే ఫైటోన్యూట్రియంట్‌లు, పొటాషియం మీ మెద‌డుకు ఆక్సిజ‌న్ స‌ప్లై స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డానికి తోడ్పడతాయి. ఫ్రీరాడిక‌ల్స్‌ను ఆపేసి, ర‌క్త‌నాళాల‌ను విశాల‌ప‌ర‌చి వాసోడైలేటర్లలాగా ప‌నిచేస్తాయి. అలాగే న‌రాల వ్య‌వ‌స్థ‌ను స్టిమ్యులేట్ చేయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగుప‌డుతుంది.

క్యాన్స‌ర్ ను నిరోధిస్తుంది
యాంటీ ఆక్సిడెంట్లు, ఆంతోసైయానిన్లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఈ వంగ‌ క్యాన్స‌ర్ రాకుండా నిరోధించ‌గ‌ల‌దు. క్యాన్స‌ర్ క‌ణాల‌ను పెర‌గ‌కుండా నిరోధించి, వ్యాధి త‌గ్గ‌డంలో తొడ్ప‌డుతుంది. ఈ కాయ తొడిమ‌లో క‌నుగొన్న సోల‌సొడైన్ రహ్మ్నోసిల్ గ్లైకోసైడ్‌లు క్యాన్స‌ర్ క‌ణాల‌ను రూపుమాప‌గ‌ల‌వు. అందుకే ఈ కాయలను తొడిమలతో సహా తీసుకోవడం మంచిది.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది
వంకాయలో ఉన్న అంతోసియానిన్ అనే పిగ్మెంట్ వ‌ల్ల గుండె ప‌నిత‌నం మెరుగ‌వుతుంది. ఇది చెడు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి, మంచి చేసే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

ఎముక‌లకు ఎంతో మంచిది
ఈ మొక్క‌లో ల‌భ్య‌మ‌య్యే ఫెనోలిక్ కాంపౌండ్‌లు ఆస్టియోపోరోసిస్‌తో పోరాడ‌తాయి. దీనితో పాటు ఎముక‌లు సామ‌ర్థ్యాన్ని పెంచి , ఎముక‌ల్లోని మిన‌ర‌ల్ సాంద్ర‌త‌ను మెరుగుప‌రుస్తుంది. అంతేకాక‌, ఇందులో దొరికే ఐర‌న్‌, కాల్షియం ఎముక‌లు ఆరోగ్యంగా ఉండ‌టానికి తోడ్ప‌డుతుంది.

బ‌రువు త‌గ్గ‌డంలో స‌హాయం చేస్తుంది
వంకాయలో కార్బోహైడ్రేట్‌లు, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉండి, వెయిట్ లాస్ డైట్ ప్లాన్ కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఇందులోని స‌పోనిన్ శ‌రీరంలో కొవ్వు చేర‌కుండా, శ‌రీరం కొవ్వును గ్ర‌హించ‌కుండా చేస్తుంది.

రక్తహీనతకు అద్భుత‌మైన ఔష‌ధం
వంకాయలో ఐర‌న్ శాతం ఎక్కువ‌. అలాగే థియామిన్‌, నియాసిన్‌, కాప‌ర్, ఫైబ‌ర్‌, ఫోలిక్ యాసిడ్‌, విట‌మిన్ సి, కె, బి6, పొటాషియం, మాంగ‌నీస్ వంటి న్యూట్రియంట్లు కూడా అధికంగా ఉంటాయి. దీన్ని తరచూ తీసుకోవడంతో మీరు రక్త హీనత తగ్గి ఆరోగ్యంగా, చురుకుగా ఉండ‌గ‌ల‌రు.

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
ఇందులో నీటి శాతంతో పాటు ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా ఉండ‌టం వ‌ల్ల పేగు వ్య‌వ‌స్థ‌లోని అనారోగ్యాన్ని త‌గ్గిస్తుంది. ల్యాక్స‌ేటివ్‌గా ప‌నిచేసి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మొత్తంగా ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ‌నంత‌టినీ మెరుగుప‌రుస్తుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Life Style

తదుపరి వార్తలు