Home /News /life-style /

DID YOU FACING STOMACH PAIN PROBLEM REGULARLY THEN FOLLOW THIS SIMPLE REMEDIES TO GET RID OF THAT PAIN EASILY PRV

Stomach pain remedies: తరచుగా కడుపునొప్పి వస్తోందా? అయితే అలా నొప్పి వచ్చినపుడు ఈ టిప్స్​ పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాతావరణ మార్పులు, తినే తిండిలో కల్తీ తదితరాల వల్ల కడుపు నొప్పి కామన్​. అయితే ప్రతిసారి కడుపునొప్పితో ఇబ్బంది పెడితే కొన్ని ఇంటి నివారణ పద్ధతులను (health tips) అనుసరించండి.

    అక్రమ సంపాదనకు అలవాటుపడిన వారు ప్రతీ దాంట్లోనూ కల్తీలు, నకిలీలు పుట్టిస్తున్నారు. ఆఖరికి మనం తినే ఆహారం (food)లోనూ ఇది మామూలైపోయింది. అయితే కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి (Stomach pain) తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు (problems) వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి (stomach pain) కారణం అవ్వవచ్చు.

    ఇంటి నివారణ పద్ధతులు..

    వేసవి కాలంలో కడుపు నొప్పి (stomach pain), అజీర్ణం సమస్యలు ఎక్కువే. ఉష్ణోగ్రతలు పడిపోవడం (Temperature down).. శరీరం చలికి గురవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు (Immunity power down).. అలసట, నీరసం కలుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ (digestive system) పై ప్రభావం చూపుతుంది. ఈ సీజన్లో కడుపులో హఠాత్తుగా నొప్పి వచ్చినా.. లేదా ప్రతిసారి తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న కొన్ని ఇంటి నివారణ పద్ధతులను (Stomach pain remedies) అనుసరించండి.

    అల్లం..

    అల్లం (Ginger) లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . కడుపు నొప్పి  (stomach pain) నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది .  ఇది వికారం, మరియు వాంతులను నివారించడంలో సహాయపడుతుంది . దీనికి కొద్దిగా తేనె కూడా చేర్చి తీసుకోవచ్చు.

    కడుపు నొప్పి తగ్గించడానికి గోరు వెచ్చని ఉప్పునీటి (Lukewarm salt water) చిట్కా గ్రేట్ గా సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు చెంచాల ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి, ఆ నీటిని త్రాగాలి . ఇది నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . కడుపు నొప్పి నివారించడంలో ఇది ఒక మంచి పద్దతిగా చెప్పవచ్చు.

    ఆహారం తిన్న వెంటనే అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. వెంటనే సోంపు నీరు తాగాలి. ఇందుకోసం ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ సోంపు (Anise) కలిపి రాత్రంతా వదిలెయ్యాలి. ఉదయాన్నే వడకట్టి.. ఆ నీటిని వేడిచేసి తీసుకోవాలి. ఒకవేళ రుచిని పెంచుకోవడానికి మీరు ఒక టీస్పూన్ తేనె (honey) కలుపుకోవచ్చు.. ఆహారం తిన్న తర్వాత కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు ఏర్పడితే వెంటనే కొద్ది మొత్తంలో బెల్లం (Jaggery) తినడం మంచిది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైములను విడుదల చేస్తాయి. అలాగే కడుపులో మంట సమస్య తగ్గుతుంది.



    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health care, Stomach Pain

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు