Home /News /life-style /

DID YOU DRINK GREEN TEA WITH LEMON DO YOU KNOW HOW MANY PROBLEMS CAN BE CHECKED BY THIS UMG GH

Green Tea with Lemon: నిమ్మకాయతో గ్రీన్ టీ కలిపి తాగారా.. దీని వల్ల ఎన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చో తెలుసా !

 నిమ్మకాయతో గ్రీన్ టీ కలిపి తాగారా .. దీని వల్ల ఎన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చో తెలుసా !

నిమ్మకాయతో గ్రీన్ టీ కలిపి తాగారా .. దీని వల్ల ఎన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చో తెలుసా !

గ్రీన్ టీ(Green Tea)లో నిమ్మరసం కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నిమ్మ(Lemon)లోని సి-విటమిన్‌తో గ్రీన్ టీ ఒక వపర్ హౌస్‌గా మారుతుంది. దీని ప్రయోజనాలు(Uses) ఏవో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
కోవిడ్(Covid) ప్రభావం తర్వాత చాలామంది ప్రజలు ఆరోగ్యం(Health)పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఆహార పద్ధతులు, జైవన శైలి అలవాట్లతో పాటు టీ, కాఫీల విషయంలోనూ మార్పులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రీన్ టీ(Green Tea)కి డిమాండ్ బాగా పెరిగింది. ఇందులో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ హాట్‌ డ్రింక్‌ను రోజులో ఎప్పుడైనా తాగి రీఫ్రెష్ కావచ్చు. అయితే గ్రీన్ టీలో నిమ్మరసం(Lemon) కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నిమ్మలోని సి-విటమిన్‌తో గ్రీన్ టీ ఒక వపర్ హౌస్‌గా మారుతుంది. దీని ప్రయోజనాలు ఏవో చూద్దాం.

బరువు తగ్గడం
నిమ్మరసం కలిపిన గ్రీన్ టీ జీవక్రియను నియంత్రిస్తుంది. వెయిట్ లాస్ మేనేజ్‌మెంట్‌లో ఈ డ్రింక్ కీలకంగా వ్యవహరిస్తుంది. గ్రీన్ టీలో ఫ్యాట్ బర్నింగ్‌ను పెంచే సమ్మేళనాలు కూడా ఉన్నాయి. నిమ్మలోని సి-విటమిన్ రోగనిరోధక శక్తి లెవల్స్‌ను మెరుగుపరుస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు
నిమ్మరసంతో కూడిన గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల డ్యామేజ్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ కారణంగా జరిగే ఆక్సీకరణ ఒత్తిడికి గ్రీన్ టీ చెక్ పెడుతుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు వివిధ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను గణనీయంగా తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

కిడ్నీల్లో రాళ్ల నివారణ
నిమ్మతో కూడిన గ్రీన్ టీని రెగ్యులర్‌గా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు, మినరల్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. కిడ్నీ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ మూత్ర మోతాదును పెంచుతుంది. కాల్షియం నిల్వలను తగ్గిస్తుంది. అలాగే కిడ్నీల్లో స్ఫటికాలు పేరుకుపోకుండా నియంత్రిస్తుంది.

ఎనర్జీ లెవల్స్ పెరుగుదల
గ్రీన్ టీ, నిమ్మలో ఎనర్జీ లెవల్స్ పెంచే సమ్మేళనాల మోతాదు ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. శరీర అలసటను పోగొట్టడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. నిమ్మ శరీరానికి తాజాదనాన్ని ఇస్తుంది.

ఇదీ చదవండి: Success Story: జేజేఈ మెయిన్ టాపర్‌గా అసోం అమ్మాయి.. ప్రిపరేషన్‌లో ఆమె చెప్తున్న మాటలు వింటే మైండ్ పోద్ది !



డయాబెటిస్ రిస్క్ తగ్గింపు
రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపర్చడంతో పాటు నియంత్రించడంలో గ్రీన్ టీ పాత్ర కీలకం. దీంతో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గే అవకాశం ఉంది.

 హైడ్రేటెడ్‌ బాడీ
నిమ్మరసం కలిపిన గ్రీన్ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా లభిస్తాయి. వెయిట్ మేనేజ్‌మెంట్, మెదడు, జీర్ణ వ్యవస్థ, కిడ్నీల సరైన పనితీరుకు ఈ హెల్తీ డ్రింక్ దోహదపడుతుంది.



తగ్గనున్న క్యాన్సర్ రిస్క్
గ్రీన్ టీ, నిమ్మ యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌లు. ఇవి ప్రాణాంతక క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. నిమ్మలో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదల, వ్యాప్తిని నివారిస్తాయి.
Published by:Mahesh
First published:

Tags: Diabetic, Green tea, Health issues, Lemon

తదుపరి వార్తలు