Sleep tips: రాత్రిళ్లు నిద్ర తొందరగా పట్టట్లేదా? మీ రోజు వారి అలవాట్లలో వీటిని కొద్దిగా మార్చుకోండి.. హాయిగా పడుకోవచ్చు

ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure) కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. చాలా మంది కూడా ఎంత కష్టపడి పని చేసి నిద్రకు ఉపక్రమిస్తారు. కానీ, వారికి నిద్ర సరిగ్గా పట్టదు.

 • Share this:
  నిద్ర అందరికీ తొందరగా రాదు. అయితే ఈ రోజుల్లో ప్రశాంతంగా నిద్రపోవడం (Sleeping ) అనేది ఒక వరంలాంటిదే. కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure) కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. చాలా మంది కూడా ఎంత కష్టపడి పని చేసి నిద్రకు ఉపక్రమిస్తారు. కానీ, వారికి నిద్ర సరిగ్గా పట్టదు.

  నిద్రలేమి  (insomnia) కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా అది శరీరంలోని రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. తద్వారా రక్తనాళాల్లో ఒత్తిడి ఏర్పడి అది మెల్లగా గుండెపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.

  వెలుతురు చూడండి..

  నిద్రపోయే ముందు మీ బెడ్‌రూమ్ (bedroom) నిశ్శబ్దంగా.. ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి . సాయుంత్రం తర్వాత కాఫీ (coffee), టీ, కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకుండా ఉంటే మంచిది. ప్రతీ రోజూ ఒకే వేళకి నిద్రపోవాలి. పగలు చిన్నకునుకు (పవర్ న్యాప్) చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. రాత్రి (night) బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పగటి వెలుగులో (day light) గడపాలి. గోరు వెచ్చని పాలు (lukewarm milk) తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర (good sleep) పడుతుంది.

  ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

  టీవీ చూడటం తగ్గించండి..

  నిద్రకు ముందు పుస్తకాలు చదవడం (reading books), టీవీ చూడటం వంటివి చేయవద్దు. నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. అయితే ముఖ్యంగా రాత్రివేళల్లో నిద్ర ఎంతో మంచిదని అధ్యయనంలో రుజువైంది. ఇటీవల పరిశోధకులు మధ్య వయస్సు ఉన్న కొంతమంది పురుషులు, మహిళల్లో రక్తనాళాల పనితీరును పరీక్షించారు.

  ఈ అధ్యయనంలో రాత్రి వేళల్లో ఆరు గంటలు కంటే తక్కువ సమయం నిద్రించినవారిలో 27 శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు నిర్ధారించారు. ఆరు కంటే ఏడు గంటల వరకు నిద్రించిన వారిలో కంటే తక్కువ సమయం నిద్రించినవారిలోనే ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని గుర్తించారు.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
  Published by:Prabhakar Vaddi
  First published: