షుగర్ వ్యాధి ఉన్నా సెక్స్ లో అదరగొట్టాలంటే...ఈ చిట్కాలు పాటించాల్సిందే...

షుగర్ వ్యాధితో బాధపడే వారిలో అలసట, అతి మూత్రం, ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల దప్పిక, ఇన్ఫెక్షన్ వంటివి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే షుగర్ లెవల్స్ నార్మల్ వద్ద మెయిన్ టెయిన్ చేస్తే మాత్రం డయాబెటిస్ ఉన్నా సెక్స్ చేయడం సులభమని నిపుణులు చెబుతున్నారు.

news18-telugu
Updated: August 18, 2019, 9:50 PM IST
షుగర్ వ్యాధి ఉన్నా సెక్స్ లో అదరగొట్టాలంటే...ఈ చిట్కాలు పాటించాల్సిందే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చాలామంది షుగర్ వ్యాధి వస్తే ఇక తమ సెక్స్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పడినట్టే అని భావిస్తుంటారు. అయితే అది కేవలం అపోహ మాత్రమే అని పరిశోధకులు తేల్చి చెబతున్నారు. కొద్దిపాటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి లాగే సెక్స్ ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారిలో అలసట, అతి మూత్రం, ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల దప్పిక, ఇన్ఫెక్షన్ వంటివి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే షుగర్ లెవల్స్ నార్మల్ వద్ద మెయిన్ టెయిన్ చేస్తే మాత్రం డయాబెటిస్ ఉన్నా సెక్స్ చేయడం సులభమని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా సెక్స్ చేసే ముందు షుగర్ వ్యాధి గ్రస్తులు తమ బ్లడ్‌లో షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. అయితే తరచూ సెక్స్ చేస్తే షుగర్ సైతం కంట్రోల్ లోకి వస్తుందని సైతం నిపుణులు చెబుతున్నారు. ఇక షుగర్ వ్యాధిగ్రస్తులు తమ సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే ఫోర్ ప్లే ఎక్కువగా చేయకుండా అసలు పని కానిచ్చేస్తే మీకు సంతృప్తి దూరం కాకుండా ఉంటుంది. ఇక షుగర్ వ్యాధి గ్రస్తులు తరచూ వ్యాయామం చేయడం కూడా సెక్స్ లైఫ్ లో ఎంజాయ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే డైట్ విషయానికి వస్తే గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటెబుల్స్ ఆహారంలో చేర్చడం వల్ల సెక్సువల్ గా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే డాక్టర్ సలహా పాటించడం అన్నింటికన్నా ముఖ్యం.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు