Home /News /life-style /

DIABETES WHAT TO EAT AND SKIP TO MAINTAIN YOUR BLOOD SUGAR LEVELS PVN

Diabetes : షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఏం తినాలి..ఏం తినకూడదు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డయాబెటిస్‌ బారినపడినవాళ్లు.. తమ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి. సాధారణ స్థాయి కంటే పెరగకుండా నిరోధించాలి. ఇది వాకింగ్,ఎక్సర్ సైజ్,మెడిసిన్స్ వంటి అనేక కార్యకలాపాలతో చేయవచ్చు.

Blood Sugar Levels : మనదేశ జనాభాలో 10 శాతం మంది షుగర్(Diabetis)వ్యాధితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితి మీ బ్లడ్ షుగర్ లెవల్స్(Sugar levels) ని పెంచడమే కాకుండా అనేక ఇతర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. డయాబెటిస్‌ బారినపడినవాళ్లు.. తమ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి. సాధారణ స్థాయి కంటే పెరగకుండా నిరోధించాలి. ఇది వాకింగ్,ఎక్సర్ సైజ్,మెడిసిన్స్ వంటి అనేక కార్యకలాపాలతో చేయవచ్చు. అయినప్పటికీ, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిర్ణయించడంలో మనం తినేది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహానికి ఉత్తమమైనవి,అలాగే తినకుండా ఉంటాల్సిన కొన్ని ఆహారాలను చూద్దాం

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్(Green Leaf Vegitables)
బచ్చలకూర వంటి ఆకు కూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, మొక్కల ఆధారిత పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా, డయాబెటిస్ ఉన్నవారికి సహాయపడే స్టార్చ్ డైజెస్టింగ్ ఎంజైమ్‌లను కూడా ఇవి కలిగి ఉంటాయి.

తృణధాన్యాలు

గోధుమలు, బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి తృణధాన్యాలు... ఫైబర్, ఇతర పోషకాలను పుష్కలంగా కలిగి ఉన్నందున వాటిని మనం తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలి. ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను మందగించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Hair Fall : హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా..ఇలా చేస్తే వెంట్రుకలు ఊడిపోయే సమస్యకు చెక్

బీన్స్

బీన్స్ ని సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ అని చెబుతారు (Complex Carbohydrates). బీన్స్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. నెమ్మదిగా జీర్ణం చేయడం అంటే పోషకాలను నెమ్మదిగా గ్రహించడం. అందువల్ల బ్లడ్ లో షుగర్ నియంత్రణలో ఉంటుంది. చాలా త్వరగా గ్రహించిన ఆహారాలు రక్తంలో షుగర్ లెవల్స్ ని అకస్మాత్తుగా పెంచుతాయి.

కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారం

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో కార్బోహైడ్రేట్ల తీసుకోవడం పరిమితం చేయాలి. వాటికి బదులుగా భారీగా ప్రోటీన్ లు ఉంటే వాటిని తీసుకోవాలి. మధుమేహం సమయంలో తెల్ల రొట్టె, బంగాళదుంపలు, తెల్ల బియ్యానికి దూరంగా ఉండాలి.



See Pics : సముద్రంపై కొత్త వంతెన..దేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి ఫొటోలు విడుదల

శుద్ధి చేసిన చక్కెర(Refined Sugar)

మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర విషం. బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి షుగర్ పేషెంట్స్... చక్కెరను, ముఖ్యంగా తెల్ల చక్కెరను తీసుకోవడం తగ్గించాలి. చక్కెరకు బదులుగా ఒక టీస్పూన్ తేనె లేదా చక్కెర రహిత వాటిని తీసుకోవడం మంచిది.

సాల్టీ ఫుడ్స్(Salty Foods)

ఉప్పు అధికంగా ఉన్న ఆహారం రక్తపోటును(Blood Preasure)పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మధుమేహంతో సంబంధం లేకుండా ఎవరైనా తమ ఆహారంలో పరిమిత పరిమాణంలో ఉప్పును ఉపయోగించాలి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Diabetes, Diabetic, Sugar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు