Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...

Diabetes Health Tips : ఈ రోజుల్లో డయాబెటిస్ చాలా మందికి వచ్చేస్తున్న అనారోగ్య సమస్య. ఎన్నో రకాల ప్రయత్నాలతో... దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పసుపుతో ఎలా కంట్రోల్ చెయ్యొచ్చో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 16, 2020, 6:11 AM IST
Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...
పసుపుతో డయాబెటిస్‌కి చెక్ (credit - twitter - Jai Commerical Centre)
  • Share this:
Diabetes Health Tips : డయాబెటిస్ కంట్రోల్ కాకపోతే... చాలా రకాల అనారోగ్య సమస్యలొస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తరచూ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తప్పవు. ఏం తిన్నా... బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం... బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని సహజసిద్ధంగా కంట్రోల్ చేసేదై ఉండాలి. అందుకు చాలా రకాల ఆహార పదార్థాలున్నాయి. వాటిలో పసుపు చాలా కీలకమైనది. పసుపుతో ఆరోగ్య ప్రయోజనాలకు లెక్క లేదు. చక్కటి లైఫ్‌స్టైల్‌‌తోపాటూ.... చక్కటి ఆహారం తీసుకుంటూ... పసుపును కూడా డైట్‌లో చేర్చుకుంటే... డయాబెటిస్‌పై చక్కటి ప్రభావం చూపించి... బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది.

టైప్ 2 డయాబెటిస్‌ని ఎలా కంట్రోల్ చెయ్యాలి : మీకు ఈ మధ్యే టైప్ 2 డయాబెటిస్ వచ్చి ఉంటే... మీ లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. చక్కటి హెల్తీ లైఫ్‌స్టైల్‌తో... డయాబెయిస్ వల్ల ఏర్పడబోయే తీవ్రమైన పరిణామాల నుంచీ తప్పించుకోవచ్చు.

పసుపుతో డయాబెటిక్స్‌కి చెక్ : పసుపులో ఔషధ గుణాలు ఎక్కువ. 2013లో జరిపిన అధ్యయనం ప్రకారం... టర్మరిక్ (పసుపు)లో ఉండే కర్క్యుమిన్ (curcumin) అనే పదార్థం... బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గించగలదు. డయాబెటిస్ వల్ల తలెత్తే ఇతర సమస్యల్ని కంట్రోల్ చెయ్యగలదు.

పసుపులోని కర్క్యుమా లోంగా అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి విష వ్యర్థాలు, వైరస్, బ్యాక్టీరియా అంతు చూస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ (విష వ్యర్థాలు)... మనకు చాలా నష్టాలు తెస్తాయి. కర్క్యుమిన్ మన శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. అందువల్ల రక్తనాళాల్లో కొవ్వు కరిగి... శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అది డయాబెటిస్ తగ్గేందుకు, కంట్రోల్ అయ్యేందుకూ వీలు కలిగిస్తుంది.

మన శరీరంలోని పాంక్రియాటిక్ కణాల పనీతీరును మెరుగుపరిచే శక్తి కర్క్యుమిన్‌కి ఉంది. ఈ కణాలనే బీటా సెల్స్ అంటారు. వీటిని పునరుత్పత్తి చెయ్యడంలో కర్క్యుమిన్ ఉపయోగపడుతుంది. కాలేయం (లివర్)లో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడంలో పసుపు బాగా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ఇది పెంచుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అందువల్ల అన్నీ వంటల్లో పసుపు వాడటం మేలు. కావాలంటే... ఓ గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే ఎంతో ప్రయోజనం.

రోజుకు ఎంత పసుపు వాడాలి : ఇది చాలా మందికి ఉండే డౌట్. పసుపు మంచిది కదా అని ఇష్టమొచ్చినట్లు వాడలేం కదా. మామూలుగా వంటల్లో చిటికెడు వేస్తారు అది ఓకే. వంటల్లో పసుపు వాడని వారు... ఖాళీ పొట్టలోకి దాన్ని వెళ్లేలా చేసుకోవాలి. రోజుకు 500 నుంచీ 2000 మిల్లీగ్రాముల పసుపును తినాలి. డైరెక్టుగా తినలేకపోతే... పాలలో వేసుకొని తాగొచ్చు. లేదా ఏదైనా తినే పదార్థంలో పసుపును కలిపేసుకొని తీసుకోవాలి. ఏం చేసైనా పసుపు మీ డైట్‌లో ఉండేలా చేసుకోవాలి. ఐతే... పసుపును ఎంత వాడాలి, ఎలా వాడాలి అనే విషయంలో డాక్టర్‌ని కలిసి వాళ్ల సూచనలు పాటిస్తే బెటర్. ఎందుకంటే... డయాబెటిస్ ఏ స్థాయిలో ఉందో, దాన్ని బట్టి ఎంత పసుపు వాడాలన్నది ఆధారపడి ఉంటుంది.


Pics : బాలీవుడ్‌ను కట్టిపడేస్తున్న తన్యా గవ్రీ ఫ్యాషన్ డిజైన్స్
ఇవి కూడా చదవండి :

Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు


Health Tips : బరువు తగ్గాలా... అలోవెరాతో ఇలా చెయ్యండి...


Health Tips : భారతీయుల్లో లోపిస్తున్న పోషకాలు ఇవీ... ఏం చెయ్యాలంటే
Published by: Krishna Kumar N
First published: September 16, 2020, 6:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading