డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి

Diabetes Health Tips : బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకపోతే... ఎన్నో సమస్యలొస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు... ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుంది.

news18-telugu
Updated: May 19, 2020, 4:57 AM IST
డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి
డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి
  • Share this:
Diabetes Health Tips : డయాబెటిస్‌ను సైలెంట్ వ్యాధి అంటారు. ఎందుకంటే... డయాబెటిస్ వచ్చిన వారు... ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువే. కానీ... డయాబెటిస్ వచ్చిన వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా పెద్దవారికి టైప్ 2 డయాబెటిస్ ఉంటే... గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 4 రెట్లు ఎక్కువ. డయాబెటిస్ వల్ల కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. కిడ్నీ పాడవుతుంది, హార్ట్ ఎటాక్స్ వస్తాయి. ఇలా చాలా రకాల సమస్యలొస్తాయి. కొన్నేళ్లుగా డయాబెటిస్ కంట్రోల్ కాకుండా ఉంటే... ఈ అనారోగ్య సమస్యలు దండయాత్ర చేస్తాయి. ఐతే... డయాబెటిస్ వచ్చిన వారు... అందరిలా కాకుండా తమ లైఫ్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో లేకపోతే వచ్చే సమస్యలు :

- రెటీనోపతి (కంటి చూపు సమస్య)
- దంతాల చిగుళ్లలో సమస్యలు
- గుండె జబ్బులు, గుండె పోటు
- నరాల సమస్యలు
- కిడ్నీ సమస్యలు- ఆహార జీర్ణ సమస్యలు
- అల్జీమర్స్ (మతిమరపు)

లైఫ్ స్టైల్‌లో చేసుకోవాల్సిన మార్పులు :
- ఆహారాన్ని రెండుగా విభజించుకోండి. మృత ఆహారం, 'అ'మృత ఆహారం. మృత ఆహారం అంటే మాంసాహారం. అందులో జీవం ఉండదు. కాబట్టి అది తక్కువ తీసుకోవాలి. అమృత ఆహారం అంటే జీవం ఉండే ఆహారం. అది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది.
- అమృత ఆహారం అంటే కాయగూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, మొలకల వంటివి. వీటిలో ఉండే జీవం... మన శరీరానికీ, కణాలకూ ఉత్తేజాన్ని ఇస్తుంది. డయాబెటిస్‌ వంటి వ్యాధులకు ఈ ఆహారం చెక్ పెట్టగలదు.
- రోజూ ఎక్సర్‌సైజ్, వాకింగ్ చెయ్యాలి. స్మోకింగ్, డ్రింకింగ్ (మద్యపానం) వంటివి పూర్తిగా పక్కన పెట్టాలి.
- కొవ్వు తెప్పించే నూనెలకు దూరంగా ఉండాలి. అలాగే ఫ్రై ఫుడ్లను వీలైనంతవరకూ తినకూడదు. వాటి బదులు... ఫ్రూట్ సలాడ్ల వంటివి తీసుకోవాలి. వాటిలో షుగర్ కలపకుండా తినాలి.
- రోజూ మీ పాదాలను గమనించుకోండి. పాదాల గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి. పాదాలకు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోండి.
- బయటకు వెళ్లే టప్పుడు షూస్ వాడండి. అవి మీ పాదలకు కంఫర్ట్‌గా ఉండేలా చూసుకోండి.
- టైట్‌గా ఉండే సాక్స్ వాడొద్దు. రోజూ కొత్త సాక్స్ వాడండి. (నిన్న వాడినవి ఇవాళ వాడొద్దు)

ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ... ఏం తినాలి, ఎంత తినాలి వంటి అంశాలపై డాక్టర్‌ సలహాలు తప్పనిసరిగా పాటించాలి. ఇలా పూర్తి జాగ్రత్తగా వ్యవహరిస్తే, డయాబెటిస్‌ మరింత పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు.

 

Photos : ఇషా రెబ్బా క్యూట్ ఫోటోషూట్... తెలుగమ్మాయి తళుకులు...ఇవి కూడా చదవండి :

Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు


Health Tips : ఫ్యాట్‌ని తగ్గించే ఫ్రూట్స్... తింటే ఎన్నో బెనిఫిట్స్...


Health Tips : ఎలాంటి కాన్సర్ నైనా తరిమికొట్టే అరుదైన నల్ల పుట్టగొడుగులు


Health Tips : రాత్రి త్వరగా భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

First published: May 19, 2020, 4:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading