Health Tips : షుగర్ పేషెంట్స్‌ జాగ్రత్తగా ఉండకపోతే ఈ జబ్బులు వస్తాయి..

షుగర్ వచ్చిందంటే చాలు.. ఒక్క అనారోగ్య సమస్య తర్వాత మరొకటి దాడి చేస్తాయి... శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో మరో విషయం తేలింది అదేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: June 30, 2019, 3:16 PM IST
Health Tips : షుగర్ పేషెంట్స్‌ జాగ్రత్తగా ఉండకపోతే ఈ జబ్బులు వస్తాయి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మధుమేహంతో బాధపడేవారికి మెడ, వెన్నునొప్పులు త్వరగా వస్తాయని తేలింది. సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టన పరిశోధనలో ఈ విషయం తేలింది. కాబట్టి.. షుగర్ పేషెంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
డయాబెటిస్ లేనివారితో పోలిస్తే.. ఉన్నవారికి వెన్ను నొప్పి వచ్చే అవకాశం 35శాతం, మెడనొప్పి వచ్చే అవకాశం 24 శాతం ఉన్నట్లు తేలింది. టైప్ డయాబెటీస్‌కు వెన్ను, మెడ నొప్పులకు దగ్గర సంబంధం ఉండటమే ఇందుకు కారణం.

ఊబకాయం, తగినంత శ్రమలేకపోవడం కూడా సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. కాబట్టి షుగర్ పేషెంట్స్ ముందునుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడూ బరువుని నియంత్రణలో ఉంచుకుని.. సరైన డైట్ తీసుకుంటూ.. వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఈ వీడియో చూడండి..

First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...