Diabetes Diet : జామకాయలు... మన దేశంలో అంతటా పెరుగుతాయి. 20 ఏళ్ల కిందట ఈ చెట్లు లేని ఇళ్లే ఉండేవి కావు. అంతలా జామచెట్లను ఇళ్ల పెరట్లలో పెంచుకునేవాళ్లు. ఎందుకంటే ఈ చెట్ల పెంపకానికి ఎలాంటి ఎరువులూ అక్కర్లేదు. పైగా... ఏడాదంతా జామకాయలు కాస్తూనే ఉంటాయి. ఇక శీతాకాలం వస్తే... వీటి దిగుబడి మరింత పెరుగుతుంది. ఈ మేటరంతా దేనికంటే... ఈ జామకాయలే డయాబెటిస్ (షుగర్ సమస్య) ఉన్నవారికి దివ్య ఔషధంలా పనిచేస్తున్నట్లు చాలా పరిశోధనల్లో తేలింది. జామకాయలతో సలాడ్ తయారుచేసుకుంటే... డయాబెటిస్ ఎలా కంట్రోల్ అవుతుందో తెలుసుకుందాం.
ఓ అంచనా ప్రకారం 2030 నాటికి ఇండియాలో 9.8 కోట్ల మందికి డయాబెటిస్ ఉంటుందట. ఆ లిస్టులో మనం చేరకుండా ఉండాలన్నా... ఆల్రెడీ ఆ సమస్యతో బాధపడుతున్న వారూ... తగిన జాగ్రత్తలు తీసుకుంటే... డయాబెటిస్‌ను కూడా లొంగదీసుకోవచ్చు. షుగర్ ఎక్కువగా ఉండే ప్యాస్ట్రీస్ (pastries), కప్ కేకులు, మైదాపిండితో తయారుచేసే పదార్థాలు, ఫ్యూట్ జ్యూస్ (షుగర్ కలిపేవి) వీలైనంతవరకూ తగ్గించుకోవాలి. అప్పుడు డయాబెటిస్ రాకుండా ఉంటుంది. వీటిబదులు ఒరిజినల్ పండ్లను తినవచ్చు. వాటిలో జామకాయ ది బెస్ట్. ఇది బాగా జీర్ణం అవుతుంది. అధిక బరువు తగ్గిస్తుంది. గుండెకు, చర్మానికీ మేలు చేస్తుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
జామ కాయ లేదా జామ పండులో గ్లైకామిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పండ్లను డయాబెటిస్ ఉన్నవారు తినకూడదు. జామకాయను తింటే... అది రక్తంలోకి గ్లూకోజ్ (షుగర్ లేదా పిండి పదార్థం)ను వెంటనే రిలీజ్ చెయ్యదు. కొద్దికొద్దిగా రిలీజ్ చేస్తుంది. అందువల్ల బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. అందువల్ల ప్రశాంతంగా ఉండొచ్చు. డయాబెటిస్ ఉన్న చాలా మంది బరువు పెరుగుతూ ఉంటారు. జామకాయల్లో కేలరీలు తక్కువ, కార్బోహైడ్రేట్స్ తక్కువ. అందువల్ల ఇవి బరువు పెరగకుండా కూడా చేస్తాయి.
జామకాయలు పండినప్పుడు వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐతే... వాటిని డైరెక్టుగా తినడం మేలు. జామ జామ్, జామ జ్యూస్, జామ చట్నీ ఇవన్నీ డయాబెటిస్ ఉన్నవారికి కరెక్టు కాదు. వాటి బదులుగా జామ సలాడ్ చేసుకొని తినడం మేలు.
జామ సలాడ్‌కి కావాల్సినవి :
ఒక చిన్న కప్పు జామ ముక్కలు
ఒక చిన్న కప్పు దానిమ్మ గింజలు
చిన్న అర కప్పు ఆవకాడో ముక్కలు
అర టీ స్పూన్ ఎండు మిర్చి కారం
జామ సలాడ్ తయారీ విధానం :
- పైన చెప్పిన పండ్ల ముక్కలన్నీ ఓ పెద్ద గిన్నెలో వేయాలి. కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, కారం చల్లాలి.
- ఇప్పుడు అన్నింటినీ అటూ ఇటూ బాగా కదిపి... తినేయవచ్చు. లేదా... కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు.
రోజూ ఈ సలాడ్ తింటే మంచిదే. ఐతే... ఎంత మోతాదులో తినాలి అనేది ఓసారి డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మేలు.