Health Tips : షుగర్ ఉన్నవారు టమాట తినొచ్చా..

డయాబెటీస్ వచ్చినవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన డైట్ మెంటెయిన్ చేయాలి. లేకపోతే జరిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. డయాబెటిస్ 2 పేషెంట్స్‌ టమాట తినొచ్చా.. తింటే ఎంత పరిమాణంలో తీసుకోవాలో చూద్దాం..

Amala Ravula | news18-telugu
Updated: May 24, 2019, 12:44 PM IST
Health Tips : షుగర్ ఉన్నవారు టమాట తినొచ్చా..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: May 24, 2019, 12:44 PM IST
టైప్‌ 2 డయాబెటీస్‌తో బాధపడేవారు చక్కని డైట్ తీసుకోవాలి. దీనివల్ల వారి ఆరోగ్యం బాగుపడడమే కాకుండా ఆరోగ్యం, బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి. అదే విధంగా.. ఆరోగ్య సమస్యలనుకూడా తగ్గిస్తుంది. అయితే, వీరి డైట్‌లో టమాటాలు చేర్చుకోవడం వల్ల లాభాలున్నాయంటున్నారు నిపుణులు.
డయాబెటీస్ పేషెంట్స్‌కి గైసమిక్ ఇండెక్స్ లెవల్స్ సరిగ్గా ఉండాలే చూసుకోవాలి. తీసుకునే ఆహారం వల్లే ఈ లెవల్స్ తగ్గడం పెరగడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ లెవల్స్ తక్కువగా అంటే 55 కంటే మంచిది. టమాటల్లో ఈ లెవల్స్ 30 ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల టైప్‌ 2 డయాబెటీస్‌కి మంచిది.

టమాటల్లో శరీరానికి మేలు చేసే పోషకాలు, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ విలువలుంటాయి. యాంటీఆక్సిడెంట్ లైకోపిన్, విటమిన్ సి, పోటాషియం, ఫొలేట్, విటమిన్ కె ఉండే టమాటను తినడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకే కాదు, క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలున్నవారికి కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా.. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్‌‌కి గుండె సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్‌ని తగ్గిస్తాయి టమాటాలు.


అదేవిధంగా.. టమాటతో పాటు పిండి పదార్థాలుగల ఆహారం డయాబెటీస్ పేషెంట్స్ డైట్‌లో ఖచ్చితంగా చేర్చుకోవాలి. అయితే.. అలానే తీసుకోవడం మంచిది.. అలా కాకుండా టమాట సాస్, వేర్వేరుగా తీసుకోవడం వల్ల గైసమిక్ లెవల్స్ 45శాతానికి పెరుగుతాయి. అందువల్లే వీటిని పచ్చిగా కానీ, వండుకుని తీసుకోవాలి. అదేవిధంగా సాండ్‌విచ్, సలాడ్స్,డ్రింక్స్‌లో యాడ్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలుంటాయి. అయితే.. ఇక్కడో విషయం చెప్పాలి. టమాటాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వీటి వర్జినల్ ఫ్లేవర్ పోతుంది. అలాకాకుండా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచి వండుకోవడం వల్ల వాటి ఉపయోగాలను పొందొచ్చు.



ఇవి కూడా చదవండి..

వారానికి 3 సార్లు ఆ పనితో అదనపు లాభాలు..
First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...