Home /News /life-style /

DIABETES DIET 5 PRE LUNCH SNACK IDEAS TO KEEP YOUR BLOOD SUGAR IN CONTROL SU GH

Diabetes Diet: చక్కెర రోగులకు ఐదు అత్యుత్తమ డైట్లు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య డయాబెటీస్. మన భాషలో చెప్పాలంటే చక్కెర వ్యాధి లేదా మధుమేహం.

ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య డయాబెటీస్. మన భాషలో చెప్పాలంటే చక్కెర వ్యాధి లేదా మధుమేహం. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఈ సమస్య తీవ్రతరమవుతుంది. చక్కెర వ్యాధి అంటే చక్కెర ఎక్కువగా తింటే వస్తుందని చాలా మంది అనుకుంటారు. శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఇది మధుమేహం వస్తుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఇవి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చక్కెర స్థాయిల్లో వ్యత్యాసం లేకుండా ఉండాలంటే అల్పాహారన్ని హృదయపూర్వకంగా తీసుకోవాలి. మధ్యాహ్నం లంచ్ కు ముందు ప్రీ లంచ్ ను తీసుకుంటే మంచిది.
ప్రీ లంచ్ అంటే మధ్యాహ్నం భోజనానికి ముందు కొద్ది స్నాక్స్ రూపంలో తీసుకోవాలి. కేలరీల వినియోగం ఆధారంగా మీ భోజనాన్ని విభజించుకోవాలి. ఎందుకంటే కేలరీలు ఎక్కువగా తీసుకుంటే మధుమేహ రోగులకు హానికరం. ఈ నేపథ్యంలో ప్రీ లంచ్ లో అత్యుత్తమ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిక్సెడ్ నట్స్ తీసుకోవాలి..
బాధం, గుమ్మడి, జీడిపప్పు, నువ్వులు, అవిసె గింజలు, అక్రోట్ల కలిగి ఉన్న గింజలను తీసుకోవచ్చు. వీటిలో విలువైన ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అధిక గింజలను వినియోగించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.

టొమాటో, కొత్తిమీర సలాడ్..
తక్కువ కేలరీలను అందించే సలాడ్లు మీకు తాజాదనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సమయం తక్కువ ఉన్న రోజుల్లో ఈ సాధారణ సలాడ్ ను తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు తరిగిన టమాటాలు, కొత్తిమీర, నిమ్మరసం, నల్ల మిరియాలతో చేసిన ఈ సలాడ్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

సీజనల్ ఫ్రూట్స్ తో చేసే చాట్ మసాలా..
ఏదైనా సీజన్ ఫ్రూట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అనంతరం చాట్ మసాలాను పైన చల్లి ఆహారంలో తీసుకోవచ్చు.

బచ్చలికూర, క్యాబేజీ జ్యూస్..
పండ్లు లేదా కూరగాయల జ్యూస్ ల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహారంలో ఇవి తప్పకుండా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో రోజులో సారి జ్యూస్ తీసుకోవడం మంచిది. కాబట్టి ఇంట్లో తయారు చేసిన జ్యూస్ ను ప్రయత్నించవచ్చు. బచ్చలికూర, క్యాబేజీ ఆకులకు నీటిని జోడించి ఆ రసాన్ని తాగితే మంచిది.

క్యారెట్ హమ్మస్..
క్యారెట్ తో తయారు చేసిన హమ్మస్ ను ఎంపిక చేసుకోవచ్చు. క్యారెట్ ఇష్టపడక పోయినట్లయితే బదులుగా తాజా దోసకాయను ఉపయోగించవచ్చు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Diabetes, Health Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు