Fruit for type 2 diabetes : బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండాలటే... మనం ఆరోగ్యంగా ఉండాలి. బ్రేక్ ఫాస్ట్‌గా ఆవకాడోను తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు వీలవుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే... టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అది రాకుండా, లేక వచ్చిన వ్యాధిని తగ్గించుకోవాలంటే... అధిక బరువు తగ్గించుకోవాలి. అలాగే... చక్కటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసుకుంటే... టైప్ 2 డయాబెటిస్ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు తినే ఆహారం, తినే విధానం ఈ రెండూ... బ్లడ్‌లో ఎంత షుగర్ ఉంటుందో డిసైడ్ చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చెయ్యడంలో ఆవకాడో చక్కగా ఉపయోగపడుతుంది.
Type 2 diabetes : ఆవకాడోను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. న్యూట్రిషన్ జర్నల్ ప్రకారం... బ్రేక్ ఫాస్ట్‌లో ఆవకాడోను చేర్చుకుంటే ఎంతో మేలు. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచాలంటే... ఆవకాడోను రోజూ తినేలా ప్లాన్ చేసుకోవాలి. ఆవకాడోలో మంచి కొవ్వు ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకూ, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఆవకాడో ఆరోగ్య ప్రయోజనాలు :
1. ఆవకాడో అనేది ఎక్కువ ఫ్యాట్, తక్కువ కార్బొహైడ్రేట్ ఉన్న ఆహారం. అందువల్ల ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగనివ్వవు. ఆవకాడో తింటే పొట్ట నిండిన ఫీల్ కలుగుతుంది. అందువల్ల ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉండదు.
2. ఆవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
3. ఆవకాడోలో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీ పేషంట్లకు మేలు చేస్తుంది. బీపీపై సోడియం చూపే నెగెటివ్ ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
4. ఆవకాడో కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడుతుంది.
5. బ్లడ్ ప్రెష్షర్, కొలెస్ట్రాల్ ప్రయోజనాల వల్ల ఆవకాడో పండు... గుండెకు ఎంత మేలు చేసేదిగా మారింది.
Type 2 diabetes : బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేసే ఇతర ఆహారాలు - ఆవకాడోలతోపాటూ... కొన్ని ఇతర ఆహారాలు సైతం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్లో ఉంచుతాయి. తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహార పదార్థాలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నార్మల్‌గా ఉంచుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు... కింది పదార్థాలను రోజూ తీసుకోవాలి.
- బ్రౌన్ రైస్
- కాయధాన్యాలు
- ఓట్ మీల్స్
- తాజా పండ్లు, కూరగాయలు
- బీన్స్, చిక్కుళ్లు
- తృణధాన్యాలు
- గింజలు, నట్స్ (బాదం, పిస్తా వంటివి)
Type 2 diabetes : బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకూడదంటే వీటికి దూరంగా ఉండాలి.
- షుగర్ కలిపిన డ్రింక్స్
- ఆల్కహాల్ (మద్యం)
- కార్పొనేటెడ్ పదార్థాలు
- బాగా ఫ్రై చేసిన ఆహారం
- జంక్ ఫుడ్
- ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఫుడ్
- రిఫైన్డ్ షుగర్
- డెసెర్ట్స్
- రిఫైన్డ్ కార్పొహైడ్రేట్స్ (పాస్తా, మైదా, వైట్ బ్రెడ్ వంటివి)
Pics : మిల్కీ బ్యూటీ తమన్నా మెరుపులు
ఇవి కూడా చదవండి :
Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.
Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు
Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు
Health Tips : పండగ సీజన్లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి
Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diabetes, Health benefits, Tips For Women, Women health