news18-telugu
Updated: June 1, 2019, 3:34 PM IST
షుగర్ ఉంటే గనుక ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవాలి.
చాలామందికి కొలెస్ట్రాల్ సమస్య ఉంటుంది. శరీరంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన కొవ్వుని తగ్గించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అందులో ఒకటి ట్యాబ్లెట్స్ వేసుకోవడం. అవే స్టాటిన్స్ వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గుతుంది. కానీ తాజాగా తేలిన విషయమేంటంటే టైప్ 2 డయాబెటిస్ మధుమేహానికి గురవుతారని తేలింది. క్లినికల్ ఫార్మాలజీ బ్రిటిష్ జర్నల్ 45ఏళ్ళు పైబడిన 9500మందిపై 15 సంవత్సరాలపాటు అధ్యయనం చేశారు. ఇందులో ఆసక్తికర నిజాలు తెలిసాయి.
కొవ్వు స్థాయిని తగ్గించే మాత్రలు వాడని వారితో పోలిస్తే.. స్టాటిన్స్ తీసుకునేవారిలో టైప్ 2 మధుమేహం అభివృద్ధి చెందింది. ఇందుకు కారణమేంటంటే.. స్టాటిన్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత పెరుగుతాయట. అందువల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుందని చెబుతున్నారు.
కాబట్టి ఇలాంటి ట్యాబ్లెట్స్కి దూరంగా ఉండి సహజ పద్ధతిలో ఒంట్లోని కొవ్వు శాతం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
Published by:
Amala Ravula
First published:
June 1, 2019, 3:32 PM IST