Diabetes : కలుషిత గాలితో షుగర్ వస్తుందట..

వాయికాలుష్యం పెరిగిపోయింది. దీంతో జబ్బులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా తేలిన విషయమేంటంటే వాయికాలుష్యంలో ఎక్కువగా ఉంటే షుగర్ వస్తుందని తేలింది. కాబట్టి షుగర్ బారిన పడొద్దనుకునేవారు కలుషితమైన గాలిన పీల్చొద్దని చెబుతున్నారు.

Amala Ravula | news18-telugu
Updated: March 13, 2019, 11:46 AM IST
Diabetes : కలుషిత గాలితో షుగర్ వస్తుందట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
షుగర్ వ్యాధి నేడు ప్రతీఒక్కరిని భయానికి గురిచేస్తోంది. ఈ సమస్య వచ్చిందంటే చాలు ఒకదాని తర్వాత మరొక అనారోగ్య సమస్య ఒంటిపై చేరతాయి. కాబట్టి ఈ జబ్బు రాకుండా చాలా మంది ముందునుంచే జాగ్రత్తపడుతున్నారు. ఈ నేపథ్యంలో కలుషిత ప్రదేశాల్ల తిరగొద్దని చెబుతున్నారు వైద్యనిపుణులు.
కొంతమంది పరిశోధకులు 80వేల మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. గాలిల ఉండే పీఎం 2.5 ధూళికణాలు, మధుమేహానికి కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాయుకాలుష్యంలో జీవించేవారు డయాబెటీస్ సమస్యను ఎదుర్కొంటారని.. చైనాలో మధుమేహులు అధికంగా ఉండడానికి ఇదే కారణమని చెబుతున్నారు.
కాబట్టి పొల్యూషన్‌‌ని అవాయిడ్ చేయాలని.. పొల్యూషన్ కారణంగా షుగర్ మాత్రమేరాదని ఎన్నో అనారోగ్య సమస్యలకు కాలుష్యమే కారణమని చెబుతున్నారు నిపుణులు.

First published: March 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>