ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...

Peacock Feather : సాధారణంగా నెమలి పించం నచ్చని వారుండరు. పిల్లలైతే వారి బుక్స్‌లో దాచుకుంటారు. చాలా ఇళ్లలో దాన్ని గోడలకు వేలాడ దీస్తారు. నెమలి పించంతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 4, 2020, 5:00 AM IST
ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేసే నెమలి పించం చాలా పవిత్రమైనదిగా గుర్తింపు పొందింది. హిందూ పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. చూడటానికి నెమలి పించం ఓ పక్షి ఈక అయినప్పటికీ... మన రోజు వారీ జీవితంలో ఇది చాలా సమస్యల్ని పోగొడుతుందని పండితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే... నెమలి పించం ఆ సంబంధాల్ని తిరిగి కలుపుతుందట. పిల్లలు సరిగా చదవకపోయినా, చురుగ్గా ఉండకపోయినా... వారికి నెమలి పించం ఇస్తే చాలు... మార్పు వచ్చేస్తుందట. చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యమవుతుంటే నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. మార్పు కనిపిస్తుందంటున్నారు పండితులు. నెమలి పించంను ఎలా వాడాలో తెలుసుకుందాం.

రాహు దశలో ఉంటే : కొంతమందికి రాహు దశ నడుస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నీ ఇబ్బందులే ఉంటాయి. అలాంటి వారు రాత్రి పడుకునేటప్పుడు నెమలి పించంను తలగడ (Pillow) కింద పెట్టుకోవాలి. ఆ పించం వ్యతిరేక ప్రభావాల్ని దూరం చేస్తుందట.

పనులు ఆలస్యమవుతుంటే : గ్రహాలు కలిసిరాకపోతే ఎవరికైనా కష్టాలు తప్పవు. ఐతే, ఇంట్లోని బెడ్‌రూంలో తూర్పువైపున లేదా ఈశాన్యం మూలలో నెమలి ఈకను ఉంచితే... అది పనుల్లో వేగం పెరిగేలా చేస్తుంది. ప్రాజెక్టులు కూడా సమయానికి పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

ఏకాగ్రత పెరగడానికి : పిల్లలకు నెమలిపించం ఇస్తుంటారు. ఇది మంచి పని. ఎందుకంటే... పుస్తకాల్లో నెమలి పించంను ఉంచడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందట. చదువుల్లో వెనకబడే చిన్నారులు, చదివింది వెంటనే తలకెక్కని పిల్లలు తమ పుస్తకాల్లో చిన్న చిన్న నెమలి పించాలు ఉంచుకుంటే... అవి వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయన్నది పండితోత్తముల మాట.

వాస్తు దోష నివారణకు : నెమలి పించం వాస్తు దోషాన్ని కూడా పోగొడుతుందట. ఇంటి గేటు ముందు వినాయకుడి విగ్రహంతోపాటూ... ఓ నెమలి ఈకను ఉంచాలి. ఇది వాస్తు దోషాన్ని పోగొట్టడమే కాదు... ఇంటి చుట్టుపక్కల నెగెటివ్ ఎనర్జీ (దుష్ట శక్తులు)ని కూడా తరిమికొడుతుందట.

గ్రహ దోష నివారణకు : జన్మదినం, పుట్టిన సమయం, ప్రదేశం వంటి వాటి వల్ల కొన్ని సార్లు గ్రహ దోషాలు వెంటాడుతుంటాయి. అవి లేనిపోని సమస్యలు తెస్తుంటాయి. వాటికి చెక్ పెట్టాలంటే, నెమలి పించం కావాల్సిందే. దానిపై కొద్దికొద్దిగా నీరు చల్లుతూ జ్యోతిష్యులు చెప్పినట్లుగా 21 సార్లు మంత్రాలు చదవాలి. ఆ తర్వాత ఆ నెమలి పించాన్ని పూజ గదిలో రోజంతా ఉంచాలి. తర్వాతి రోజు నీటిలో ముంచాలి. ఇలా చేస్తే గ్రహ దోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 4, 2020, 4:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading