పుదీనా ఆకుల టీతో రక్తశుద్ధి చేసుకోవడం ఎలా...?

ఔషధ గుణాలతో పాటు, జీర్ణ ప్రక్రియను సమర్ధ వంతంగా నడిపించే పోషకాలూ అధికమే పుదీనాలో ఉన్నాయి. జలుబుతో సతమతమవుతున్నా కప్ఫు పుదీనా చాయ్ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.

news18-telugu
Updated: November 2, 2019, 8:31 PM IST
పుదీనా ఆకుల టీతో రక్తశుద్ధి చేసుకోవడం ఎలా...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పుదీనా ఆకులతో టీ చేసుకొని తాగితే రక్తం శుద్ధి చేసే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చుతున్నారు. ఈ మధ్య కాలంలో బాడీ మొత్తం డీ టాక్సినేషన్ చేసే ప్రయత్నాలు విరివిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పొల్యూషన్ కారణంగా ప్రతీ ఒక్కరి శరీరంలో మలినాలు వచ్చి చేరుతున్నాయని దాని నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు. ప్రతిరోజూ పుదీనా ఆకుల టీ తీసుకుంటే రోగ నిరోధకవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పుదీనా ఆకు రసంతో శరీర బరువు తగ్గడంతో పాటు. అందులోని ప్రత్యేకమైన సువాసన మెదడులో సానుకూలంగా ప్రభావితం అవకాశం ఉంది. అలాగే అందులోని ఔషధ గుణాలతో పాటు, జీర్ణ ప్రక్రియను సమర్ధ వంతంగా నడిపించే పోషకాలూ అధికమే పుదీనాలో ఉన్నాయి. జలుబుతో సతమతమవుతున్నా కప్ఫు పుదీనా చాయ్ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో మనకు తెలి యకుండా పెరిగే కణుతులకు అడ్డుకట్ట వేయాలంటే రోజు వారీ ఆహారంలో పుదీనాను గ్రీన్ చట్నీ రూపంలో కానీ, టీగా కానీ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కడుపులో వికారం వున్నప్పుడు పుదీనా ఆకులను వాసన చూస్తే ఆ వికారం తగ్గుతుంది.

First published: November 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>