Home /News /life-style /

DESI CORN IS A SUPERFOOD YOU SHOULD HAVE THIS SEASON UMG GH

Corn In Diet: ఈ వర్షాకాలంలో మొక్కజొన్న తింటే ఉంటదీ.. డైట్ చేసే వారికి చాలా బెనిఫిట్..!

మొక్కజొన్న మీ డైట్‌లో వాడండీ

మొక్కజొన్న మీ డైట్‌లో వాడండీ

మొక్కజొన్న (corn)లో విటమిన్ (vitamin) బి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాల వల్ల జుట్టు ఆరోగ్యం (Healthy hair) మరింత మెరుగు పడుతుంది. తెల్ల జుట్టు లేదా గ్రే హెయిర్ సమస్యలు కూడా దరిచేరవు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ ఎ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
వర్షాకాలం (Monsoon)లో చాలామందికి రోగ నిరోధక శక్తి సహజంగానే క్షీణిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి రకరకాల ఆరోగ్య సమస్యలు (Health Problems) ఈ కాలంలో ఎక్కువగా వేధిస్తుంటాయి. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అయితే ఈ సీజన్‌లో ఇతర పోషక ఆహారాలతో పాటు మొక్కజొన్నను (Corn) ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) పొందవచ్చు. అలాగే రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు. సాధారణంగా వర్షాకాలంలో మొక్కజొన్నను భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మొక్కజొన్న కంకులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సీజన్‌లో వీటిని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.

మొక్కజొన్నలో విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాల వల్ల జుట్టు ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. తెల్ల జుట్టు లేదా గ్రే హెయిర్ సమస్యలు కూడా దరిచేరవు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ ఎ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ రోగనిరోధక వ్యవస్థ కణాల యాక్టివిటీని కూడా పెంచుతుంది. మొక్కజొన్నలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. Ee యాంటీఆక్సిడెంట్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అంతేకాదు, మొక్కజొన్నలు ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి.

 ఇదీ చదవండి: చిక్కు జుట్టుతో చికాకేలా.. ఇదిగో చిట్కా..! వర్షాకాలంలో మీ అందమైన కురుల కోసం..!!


మొక్కజొన్నలో ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల వీటిని తరచూ తీసుకుంటే మలబద్ధక సమస్యల నుంచి పూర్తిస్థాయిలో ఉపశమనం కలుగుతుంది. వీటిని తింటే కడుపునిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అప్పుడు అతిగా ఆహారాలు తినబుద్ధి కాదు. తద్వారా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. భారతదేశంలో స్థానికంగా దొరికే మొక్కజొన్న తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగు పడతాయి.

మొక్కజొన్నపొత్తులను ఎర్రటి బొగ్గులపై చక్కగా కాల్చుకుని తినొచ్చు. లేదా ఉడకబెట్టి రుచికరమైన మొక్కజొన్న గింజలను ఆస్వాదించొచ్చు. మొక్కజొన్నలతో గారెలు చేసుకోవచ్చు. వీటితో రోటీలు కూడా తయారు చేసుకొని కడుపునిండా తినొచ్చు. మొక్కజొన్నలో విటమిన్లు, పొటాషియం వంటి వివిధ పోషకాలు అధికంగా ఉంటాయి. గర్భిణీ తీసుకునే ఆహారంలో మొక్కజొన్న కూడా ఒకటిగా ఉంటుంది. గర్భవతులు వీటిని ఆహారంగా తీసుకుంటే వారితో పాటు బిడ్డకి కూడా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా, గర్భవతుల్లో సాధారణంగా కనిపించే మలబద్ధక సమస్యను మొక్కజొన్నను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా పోగొట్టవచ్చు.



* ఎలా తినాలి..?
మొక్కజొన్నను ఎలా తీసుకుంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటిని ఎలా తిన్నా కూడా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
Published by:Mahesh
First published:

Tags: Diet, Health benefits, Monsoon, Pop corn

తదుపరి వార్తలు