Home /News /life-style /

Face Serums: చర్మ సంరక్షణకు ఫేస్ సీరమ్‌ను ఎంచుకుంటున్నారా?.. వీటిని ఎలా వాడాలో తెలుసుకోండి

Face Serums: చర్మ సంరక్షణకు ఫేస్ సీరమ్‌ను ఎంచుకుంటున్నారా?.. వీటిని ఎలా వాడాలో తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో చర్మ సంరక్షణ, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ సాయంతో అందానికి మెరుగులు అద్దుకునే ధోరణి పెరుగుతోంది. అయితే ఇందుకు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.

ఈ రోజుల్లో చర్మ సంరక్షణ, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ సాయంతో అందానికి మెరుగులు అద్దుకునే ధోరణి పెరుగుతోంది. అయితే ఇందుకు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. చర్మ సంరక్షణపై దృష్టి పెట్టేవారు ముందు మీ చర్మ తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి తగిన ప్రొడక్ట్స్ ఎంచుకొని ఉపయోగించాలి. చర్మ సంరక్షణలో సీరమ్స్ ముఖ్యమైనవి. వాటిని అప్లై చేసుకోవడం సరిగ్గా తెలియాలే కానీ.. మీ అందాన్ని పెంచేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. అయితే ఈ సీరమ్స్ అప్లై చేసుకునే పద్ధతిపై వినియోగదారులు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొంతమంది నిపుణుల సూచనలతో రెండు రకాల సీరమ్స్‌ను ఒకేసారి వాడుతారు. అయితే వీరు ముందు పల్చగా ఉన్న సీరమ్‌ను చర్మంపై అప్లై చేయాలి. దీనివల్ల అది చర్మంలోకి బాగా ఇంకి చర్మానికి మెరుపును అందిస్తుంది. ఆ తరువాత చిక్కగా ఉండే సీరమ్‌ను వాడవచ్చు. అందుకే మీరు రెండు సీరమ్స్ ఎంచుకుంటుంటే అందులో ఏది ముందు ఏది తర్వాత అని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ ఏ సీరమ్ మొదట పెట్టుకోవాలో మీకు తెలియకపోతే.. ఈ పద్ధతిని పాటించండి. రెండు చుక్కల సీరమ్ ఆయిల్‌ను చేతిపై వేసి ఏది పల్చగా ఉందో చూడండి. దాన్ని ముందు చర్మంపై అప్లై చేసుకోవాలి. అంతేకాదు.. ఒకవేళ మీరు టోనర్ ఉపయోగించే వ్యక్తులైతే దాని విషయంలోనూ జాగ్రత్త వహించాలి. యాసిడ్ బేస్డ్ టోనర్‌ను సీరమ్ కంటే ముందే ఉపయోగించాల్సి ఉంటుంది.

రెండు కంటే ఎక్కువ సీరమ్స్‌ను ఒకేసారి ఉపయోగించకూడదు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇలాంటి ఉత్పత్తులను వాడటం వల్ల పెద్దగా ప్రతిఫలం ఉండకపోవచ్చు.

సీరమ్ ఉపయోగించే ముందు అందులో ఉపయోగించిన పదార్థాలను ఓసారి చెక్ చేయాలి. రెండు సీరమ్స్‌లో ఒకే రకమైన పదార్థాలు ఉంటే.. వాటిని కలిపి ఉపయోగించడం సరికాదు. సీరమ్స్ లో ఎక్కువగా ఉండే హైలురోనిక్ యాసిడ్ వంటివి రెండిట్లో కాకుండా ఏదైనా ఒకదానిలో మాత్రమే ఉండేలా చూసుకోవాలి. రెండిట్లోనూ అది ఉండే మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ మీరు ఉపయోగించే సీరమ్‌లో AHA/BHA ఉంటే రెటినాల్ ఉన్న మరో సీరమ్‌ని దానికి కలిపి ఉపయోగించాలి. విటమిన్ సి, రెటినాల్ కూడా మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు హైలురోనిక్ యాసిడ్, విటమిన్ సి లేదా నియాసినమైడ్, రెటినాల్ వంటి కాంబినేషన్ కూడా ఉపయోగించవచ్చు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Beauty tips, Lifestyle

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు